కనుబొమలు... మాయమవుతున్నాయి!

కొందరిలో తలమీద వెంట్రుకలు రాలిపోయి, మాడు కనిపిస్తుంది కదా! నాకు కనుబొమల విషయంలో అదే పరిస్థితి. అసలు వెంట్రుకలే లేవు. పట్టిచూస్తే సన్నగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

Published : 26 May 2024 17:13 IST

కొందరిలో తలమీద వెంట్రుకలు రాలిపోయి, మాడు కనిపిస్తుంది కదా! నాకు కనుబొమల విషయంలో అదే పరిస్థితి. అసలు వెంట్రుకలే లేవు. పట్టిచూస్తే సన్నగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇదేమైనా సమస్యా?

ఓ సోదరి

సాధారణంగా ఇన్ఫెక్షన్లు, హార్మోనుల్లో మార్పులు, థైరాయిడ్‌ వంటివి ఇందుకు దారితీస్తాయి. కొందరు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, విపరీతంగా డైట్‌ చేయడం లాంటివి చేస్తుంటారు. ఆ ప్రభావం కనుబొమలపైనా పడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మేకప్‌ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం, తరచూ ఐబ్రోస్‌ తీయించుకోవడం వంటివీ సమస్యగా మారుతుంటాయి. గుండ్రని ప్యాచ్‌లు వస్తే అలోపేషియా ఏరియేటా అయ్యుండొచ్చు. ఇమ్యూన్‌సిస్టమ్‌ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇది వస్తుంది. కొందరిలో రెప్పలపై ఉన్న వెంట్రుకలూ పోతాయి. దురద, చర్మం పొట్టులా రాలడం వంటివి ఉంటే ఎగ్జిమా కావొచ్చు. సొరియాసిస్, కాంటాక్ట్‌ డెర్మటైటిస్, సెబోరిక్‌ డెర్మటైటిస్‌ వంటివీ కారణమవొచ్చు. ముందు కనుబొమలు రాలడానికి అసలు కారణమేంటో నిపుణులను సంప్రదించి తెలుసుకోండి. మామూలుగా మినాక్సిడల్‌ 5% ద్రావణం, కార్టికో స్టిరాయిడ్‌ క్రీములు వాడటం ద్వారా పరిస్థితి అదుపులోకి తెచ్చుకోవచ్చు. సమస్య పెద్దది అయితే మందులు, ఇంజెక్షన్లనూ తీసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు మస్కారా, ఐబ్రో పెన్సిల్‌ వాడకాన్ని తగ్గించండి. విటమిన్లు, మినరల్స్‌ ఆహారం ద్వారా సమృద్ధిగా అందేలా చూసుకోవడంతోపాటు ఒత్తిడికీ దూరంగా ఉండండి. ఇన్నీ చేశాక కూడా పెరుగుదల లేకపోతే అప్పుడు ఐబ్రో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్