Updated : 10/05/2021 07:12 IST

Inspiration: ఊరికి ఊతంగా నిలిచింది!

‘ఊతకర్రల సాయం లేనిదే కాలు కూడా కదపలేవు... ఓ మనిషి ఆసరా లేనిదే ఎక్కడికీ వెళ్లలేవు.. సర్పంచ్‌గా ఊరినేం ఉద్దరిస్తావ్‌?’  అంటూ వెక్కిరించిన వారి నోళ్లను మూయించిందామె. అంతే కాదు వారి చేతే ‘శెభాష్‌ కవిత’ అనిపించుకుంది.
హెగావ్‌, వాల్గడ్‌ గ్రామాలకు చెందిన యువ సర్పంచ్‌ 34 ఏళ్ల కవితా భోండ్వే... ఇంటర్‌ చదివిన ఈమె తొమ్మిదేళ్లుగా మహారాష్ట్ర, నాసిక్‌ జిల్లా, దిండోరి తాలుకాలోని రెండు గ్రామాలకు సర్పంచ్‌గా సేవలందిస్తోంది.
ఎన్నికైన వెంటనే రహదారుల నిర్మాణం, మంచినీటి సరఫరా, పేదలకు పక్కా ఇళ్లు లాంటి వాటిపై దృష్టిపెట్టింది. అయితే ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు చాలారకాల హేళనలు, వివక్షను ఎదుర్కొంది. తన వైకల్యాన్నీ వెక్కిరించినా బాధపడలేదామె. తనేంటో గ్రామాభివృద్ధిలో చేసిన కృషి ద్వారా నిరూపించింది. ఆ సమయంలో సోదరుడు, తండ్రి ఆమెకు అండగా నిలబడ్డారు.
కవిత తండ్రి పుందలిక్‌ భోండ్వే పదిహేనేళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. చదువుకోని కారణంతో చాలారకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన తన కూతురిని సర్పంచ్‌ చేయడం ద్వారా గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించాడు.
2011లో తొలిసారిగా కవిత సర్పంచ్‌గా నిలబడింది. పాతికేళ్ల యువతి అందునా దివ్యాంగురాలు సర్పంచ్‌గా ఎన్నికవడం గ్రామంలో కొందరికి నచ్చలేదు. కానీ పోటీచేసిన మొదటిసారే కాకుండా తను చేసిన అభివృద్ధి పనులతో రెండోసారి కూడా విజయం సాధించింది.
ఆమె సర్పంచ్‌గా ఎన్నికైన ఈ తొమ్మిదేళ్లలో రెండు గ్రామాల్లో  చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా కాంక్రిట్‌ రోడ్లను వేయించింది. పేదలకు ఇళ్లు వచ్చేలా చేసింది. గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. తాగుబోతుల ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. స్వయంసహాయక మహిళా బృందాలను ఏర్పాటు చేసింది. అమ్మాయిలు చదువుకునేలా ప్రోత్సహిస్తోంది. తాజాగా ‘జనజాగృతి’ అనే కార్యక్రమం ద్వారా కొవిడ్‌ బారిన పడకుండా ఎలా ఉండాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూస్తోంది. మాస్కు లేకపోతే జరిమానా విధిస్తోంది. ఈ రెండు గ్రామాల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తోంది. సేవ చేయాలనే గట్టి కోరిక ఉంటే చాలు.. వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోందీ సర్పంచ్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి