ప్రాణవాయువు ఇంట్లోనే...

మొక్కల్ని పెంచాలంటే ఎండ అవసరం అనుకుంటాం. కానీ ఇంట్లోనే తగిన వెలుతురుతో అందంగా ఎదిగే మొక్కలెన్నో ఉన్నాయి. ఇలా ఇండోర్‌లో వాటిని పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?

Published : 09 Jun 2021 00:39 IST

మొక్కల్ని పెంచాలంటే ఎండ అవసరం అనుకుంటాం. కానీ ఇంట్లోనే తగిన వెలుతురుతో అందంగా ఎదిగే మొక్కలెన్నో ఉన్నాయి. ఇలా ఇండోర్‌లో వాటిని పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
మొక్కలున్న పరిసరాల్లో ప్రాణవాయువు ఉంటుంది. కళ్లకింపుగా, మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. పనిచేసే చోట పెంచితే...ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. పోతోస్‌(మనీప్లాంట్‌), సాన్సవేరియా, పీస్‌లిల్లీ, అలోవీరా, బోస్టెన్‌ ఫెర్న్‌, ఫిలడెండ్రాన్‌... వంటి రకాల్ని సులువుగా పెంచుకోవచ్చు. వీటినీ పరోక్షంగా వెలుతురు వచ్చే చోటకానీ, లైట్‌ కింద కానీ పెడితే చాలు చక్కగా ఎదుగుతాయి.
* ఏసీల వల్ల కిటికీలు మూసి ఉంచుతాం. ఫలితంగా ఊపిరి అందకపోవడం, ఆస్తమా, దగ్గు, అలర్జీల వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు... మనం ఇంట్లో వాడే క్లీనింగ్‌ సొల్యూషన్స్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వంటివాటి నుంచి విడుదలయ్యే రసాయనాలను శుభ్రపరుస్తాయి.
* మొక్కలు గాలిలోని దుమ్ముని తగ్గిస్తాయి. వీటిని ఇంటిలో అమర్చుకోవడం వల్ల గాలిలోని దుమ్ము 20 శాతం తగ్గినట్లుగా అనేక అధ్యయనాలూ చెబుతున్నాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్నచోట మొక్కల్ని పెంచి చూడండి. ఆ ఇబ్బంది కచ్చితంగా కొంతైనా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్