వక్షోజాల్లో నొప్పి, గడ్డ.. ఎందుకిలా?

మేడమ్‌.. నా వయసు 38. బరువు 70 కిలోలు. నాకు గత కొన్ని నెలల నుంచి ఎడమవైపు రొమ్ములో బాగా నొప్పిగా ఉంటోంది. పరీక్షించుకుంటే చిన్న గడ్డలాగా తగులుతోంది.. కానీ దాన్ని ముట్టుకుంటే కదులుతోంది. ఇక ఈ మధ్య కుడివైపు రొమ్ములో కూడా.....

Updated : 27 Jun 2022 13:27 IST

(Image for Representation)

మేడమ్‌.. నా వయసు 38. బరువు 70 కిలోలు. నాకు గత కొన్ని నెలల నుంచి ఎడమవైపు రొమ్ములో బాగా నొప్పిగా ఉంటోంది. పరీక్షించుకుంటే చిన్న గడ్డలాగా తగులుతోంది.. కానీ దాన్ని ముట్టుకుంటే కదులుతోంది. ఇక ఈ మధ్య కుడివైపు రొమ్ములో కూడా నొప్పిగా అనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? - ఓ సోదరి

జ: రొమ్ములో గడ్డ తగిలినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి.. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా సోనో మామోగ్రఫీ, ఇంకా అవసరమైతే ఎక్స్‌రే మామోగ్రఫీ చేయించుకోవాలి. అది ఎటువంటి గడ్డ అని అనుమానంగా ఉంటే.. ఒక చిన్న సూదితో ఫైన్‌ నీడిల్ యాస్పిరేషన్‌ సైటాలజీ (FNAC) కానీ లేదా కోర్‌ బయాప్సీ కానీ చేసి నిర్ధారణకు వస్తారు. కొన్నింటికి మందులతో చికిత్స చేయచ్చు.. మరికొన్నింటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని