పిల్లలు ఇష్టంగా పాలు తాగడం లేదా?
పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు.
పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా వారి శరీర ఎదుగుదలకు అందాల్సిన పోషకాలు అందకుండాపోతాయి. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలేయలేం. కాబట్టి రోజూ పిల్లలు తాగే పాలు మరింత రుచికరంగా తయారు చేయాలి. అప్పుడే వారు మరింత ఇష్టంతో పాలు తాగుతారు.
తయారు చేయండిలా!
పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసే పాలు వారు ఇష్టంగా తాగాలంటే.. రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్‌షేక్స్‌గా తయారు చేసి వారికి అందించాలి. అయితే వీటి తయారీలో పండ్ల పరిమాణం కాస్త తక్కువగా, పాల పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చు. అలాగే 'ఎక్కువ తియ్యగా ఉంటే త్వరగా తాగుతారు కదా..' అని చక్కెర మరీ అధికంగా వేయకూడదు. ఎందుకంటే మొదట వారికి ఎక్కువ తీపితో అందించి.. తర్వాత క్రమంగా తీపి తగ్గిస్తే వారు ఇవి కూడా తాగకపోవచ్చు. అలాగే అధిక చక్కెర వినియోగించడం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.
బలవర్థకమైనవే..
చాలామంది పిల్లలు కేవలం పాలు మాత్రమే ఇస్తే తాగరు. అందులో బాదం, పిస్తా, కుంకుమపువ్వు, చాక్లెట్.. వంటి ఫ్లేవర్లతో కూడిన శక్తిమంతమైన, రుచికరమైన పదార్థాల్ని కలిపితే గానీ వాటి మొహం కూడా చూడరు. అయితే కొంతమంది తల్లులు మాత్రం వీటిని పాలలో కలపడం వల్ల పాల నాణ్యత దెబ్బతింటుందని భావిస్తారు. కానీ రుచికోసం పిల్లల పాలలో కలపడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు. అలాగే పోషకాహార నిపుణుల సలహా తీసుకుని కూడా రుచి కోసం పాలలో కలిపే పదార్థాల్ని ఎంచుకోవచ్చు. ఫలితంగా పిల్లలకు అందించే పాలు రుచిగా మారడంతో పాటు పాలలో ఉండే క్యాల్షియం, విటమిన్ డి.. వంటి పోషకాలు పిల్లలకు సమృద్ధిగా అందుతాయి.
వెన్నతో పాటే..
వెన్నతో కూడిన పాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కొంతమంది తల్లులు పిల్లలకు వీటిని నేరుగా ఇస్తే.. అందులోని కొవ్వులు శరీరంలోకి చేరి.. లేనిపోని సమస్యలకు దారితీస్తాయన్న సందేహంతో వెన్న తొలగించి అందిస్తారు. కానీ ఇలాంటి పాలు పిల్లలకు అస్సలు రుచించవు. అందుకే పాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు వెన్నతోనే ఇస్తూ.. క్రమంగా అందులోని వెన్న శాతాన్ని తగ్గిస్తే మంచిది. ఫలితంగా వారికి పాలు రుచించడంతో పాటు కొన్ని రోజుల తర్వాత వెన్న తొలగించిన పాలను తాగడానికి కూడా పిల్లలు అలవాటుపడే అవకాశం ఉంటుంది.
ఇవి కలపొచ్చు..
పిల్లలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి ఇష్టపడే కార్న్‌ఫ్లేక్స్, చాకోస్.. వంటివి నేరుగా అందించకుండా.. పాలలో కలిపి ఇవ్వడం శ్రేయస్కరం. దీంతో వాటిలోని రుచి పాలలోకి చేరి.. పాలు మరింత రుచిగా మారతాయి. ఫలితంగా వారు ఆ పదార్థాల్ని తిని, అలాగే పాలు కూడా తాగుతారు. ఇలా మీరు అందించే ఆహారంతో అటు పాలు తాగడం, ఇటు బ్రేక్‌ఫాస్ట్ చేయడం.. రెండూ పూర్తవుతాయి.
పలు రకాలుగా!
స్వీట్లంటే కేవలం బయట నుంచి తెచ్చుకున్నవే కాదు.. ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇంట్లో చేసే సేమ్యా, కలాకండ్, ఖీర్.. మొదలైన మిఠాయిల్లో పాలు అధికంగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఎక్కువగా ఇలాంటి తీపి పదార్థాలు చేసి అందించాలి. ఫలితంగా స్వీట్ల రూపంలోనూ పాలు వారికి అందించవచ్చు. అలాగే పిల్లలకు ఐస్‌క్రీమ్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లోనే పాలతో ఐస్‌క్రీమ్ తయారు చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు ఇవ్వడానికి తయారు చేసే కేక్స్, బిస్కెట్స్, ఓట్మీల్, పాస్తా.. వంటి పదార్థాల్లో నీళ్లకు బదులుగా పాలను ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిదే.
పిల్లలకు బలవర్థకమైన పాలను రుచిగా ఎలా అందించాలో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి. వారి సంపూర్ణ ఎదుగుదలకు సహకరించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!