వేసవిలో ఈ చల్లచల్లని టీలు.. మీకోసమే!

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది ‘టీ’లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ వేసవిలో వేడిమిని తరిమికొట్టి చల్లదనాన్ని...

Published : 18 Apr 2022 18:58 IST

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది ‘టీ’లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ వేసవిలో వేడిమిని తరిమికొట్టి చల్లదనాన్ని అందించే టీలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఆ ‘ఐస్డ్‌ టీ’ రెసిపీలే ఇవి!

తులసి-స్ట్రాబెర్రీ టీ

కావాల్సినవి

* నీళ్లు - 5 కప్పులు

* గ్రీన్ టీ బ్యాగులు - 8

* తులసి ఆకులు - గుప్పెడు

* స్ట్రాబెర్రీలు - కప్పు

* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా

తయారీ

ముందుగా మరిగించి పెట్టుకున్న గ్రీన్ టీ మిశ్రమంలో స్ట్రాబెర్రీ ముక్కలు, తులసి ఆకులు వేసుకోవాలి. ఈ నీళ్లు చల్లారాక వడకట్టుకొని గ్లాసుల్లోకి తీసుకొని రుచికి సరిపడా తేనె లేదా చక్కెర, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ టీ మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.


లెమనేడ్-మింట్ టీ

కావాల్సినవి

* నీళ్లు - 4 కప్పులు

* గ్రీన్ టీ బ్యాగులు - 4

* నిమ్మరసం - 2 టీస్పూన్లు

* పుదీనా ఆకులు - అరకప్పు

* తేనె లేదా చక్కెర - రుచికి సరిపడా

తయారీ

ముందుగా మరిగించుకున్న నీటిలో గ్రీన్ టీ బ్యాగులు, నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి చల్లారనివ్వాలి. ఆపై దీన్ని వడకట్టుకొని గ్లాసుల్లోకి తీసుకొని.. తేనె, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. ఈ టీ చల్లదనాన్ని, మెదడుకు నూతనోత్సాహాన్ని అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్