నల్లపూసల బ్రేస్‌లెట్.. ఇప్పుడిదే ట్రెండు!

ఈ కాలపు అమ్మాయిలు ఏ ఫ్యాషన్‌ ఫాలో అయితే అదే ట్రెండు! సాధారణంగా మెడలో ధరించే నల్లపూసల్ని ఇప్పుడు స్టైలిష్‌గా మణికట్టుకు బ్రేస్‌లెట్‌లా ధరిస్తున్నారు. నేటి తరం అమ్మాయిల అభిరుచులు, ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్‌ పోకడల్ని దృష్టిలో ఉంచుకొని డిజైనర్లు కూడా సరికొత్త డిజైన్లలో....

Updated : 14 Jul 2022 18:21 IST

ఈ కాలపు అమ్మాయిలు ఏ ఫ్యాషన్‌ ఫాలో అయితే అదే ట్రెండు! సాధారణంగా మెడలో ధరించే నల్లపూసల్ని ఇప్పుడు స్టైలిష్‌గా మణికట్టుకు బ్రేస్‌లెట్‌లా ధరిస్తున్నారు. నేటి తరం అమ్మాయిల అభిరుచులు, ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్‌ పోకడల్ని దృష్టిలో ఉంచుకొని డిజైనర్లు కూడా సరికొత్త డిజైన్లలో నల్లపూసల మాదిరిగా కనిపించే బ్రేస్‌లెట్లను రూపొందిస్తున్నారు. మరికొందరు తమకు నచ్చినట్లుగా పర్సనలైజ్‌డ్‌ తరహావి చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలో బంగారం లేదా వెండి, నల్ల పూసలతో బ్రేస్‌లెట్‌ చేయించుకొని.. తమ అదృష్ట రాయి, భర్త పేరు లేదంటే పేరులోని మొదటి అక్షరం, లవ్‌ సింబల్‌, స్టోన్స్‌ లేదా ముత్యాలు పొదిగినవి, బుట్టా లేదా జుంకీ తరహావి, నచ్చిన బొమ్మల్ని.. ఇలా విభిన్న రకాలైన లాకెట్స్‌ని దానికి జత చేసుకుంటున్నారు. అలాగే ఈ తరహా నల్లపూసల్లోనూ రెండు మూడు లేయర్లున్నవి, బ్రేస్‌లెట్‌ చుట్టూ మువ్వలు వేలాడేలా ఉన్నవి.. తదితర డిజైన్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి. మరి, అమ్మాయిల మనసు దోచుకుంటోన్న అలాంటి స్టైలిష్‌, ఫ్యాషనబుల్ బ్రేస్‌లెట్ల పైన ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్