పీసీఓఎస్‌కు పరిష్కారముందా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 25. ఎత్తు 5’4’’. బరువు 68 కిలోలు. గత రెండేళ్ల నుంచి నేను PCOS (Bilateral) తో బాధపడుతున్నా. దీని పరిణామాలేంటో చెప్పండి. అలాగే నేను బరువు తగ్గాలంటే పాటించాల్సిన ఆహార నియమాలేంటి?

Published : 28 Aug 2021 16:01 IST

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 25. ఎత్తు 5’4’’. బరువు 68 కిలోలు. గత రెండేళ్ల నుంచి నేను PCOS (Bilateral) తో బాధపడుతున్నా. దీని పరిణామాలేంటో చెప్పండి. అలాగే నేను బరువు తగ్గాలంటే పాటించాల్సిన ఆహార నియమాలేంటి?

- ఓ సోదరి

జ: మీరు పీసీఓఎస్‌తో బాధపడుతున్నానని రాశారు.. కానీ మీకు ఎటువంటి లక్షణాలున్నాయో రాయలేదు. పీసీఓఎస్‌ అనేది ఒక మల్టీఫ్యాక్టోరియల్‌ డిసీజ్‌.. అంటే అనేక కారణాల వల్ల కలిగే ఒక వ్యాధి. అలాగే దీని లక్షణాలు కూడా రకరకాలుగా ఉంటాయి. మీకు చికిత్స చేయాలంటే మీరు ముఖ్యంగా ఏ లక్షణంతో బాధపడుతున్నారో తెలియాలి. నెలసరి సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడం, మొహమ్మీద-మెడ మీద మొటిమలు రావడం, పిల్లలు పుట్టకపోవడం.. మొదలైనవి దీని వల్ల కలిగే లక్షణాలు. మీకు ఇంకా పెళ్లి కాలేదు.. నెలసరి సరిగ్గా రావాలి అనుకుంటే ఒక రకం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మీకు పెళ్లైంది.. కానీ పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే ఇంకో రకం చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మీరు అనుకున్నట్లుగానే బరువు తగ్గడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే మీకు జీవనశైలి గురించి, బరువు తగ్గడానికి పాటించాల్సిన చిట్కాల గురించి సూచిస్తూ.. మీ లక్షణాలను కూడా విశ్లేషించి చూసి దానికి తగిన చికిత్స అందిస్తారు.

 - డా|| వై. సవితాదేవి, గైనకాలజిస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్