Ponniyin Selvan: సందడి చేస్తున్న.. అందాల తారలు!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండవ భాగం శుక్రవారం (ఏప్రిల్ 28) విడుదల కానుంది. తమిళనాట అత్యంత పాఠకాదారణ పొందిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా....

Updated : 28 Apr 2023 13:01 IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. తమిళనాట అత్యంత పాఠకాదారణ పొందిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. గతేడాది విడుదలైన మొదటి భాగం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు రెండో భాగం పైన కూడా సర్వత్రా అంతే ఆసక్తి నెలకొంది.

అగ్ర తారలు త్రిష, ఐశ్వర్యారాయ్‌లు మొదటి భాగంలో ప్రధాన పాత్రలు పోషించి తమదైన శైలిలో అలరించారు. ఇందులో త్రిష కుందవైగా, ఐశ్వర్యారాయ్ నందినిగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వితీయ భాగం విడుదలవుతున్న సందర్భంగా ఈ ఇద్దరు అందాల తారలు పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో- ఎప్పటికప్పుడు తమ అందం, అభినయానికి సాటి లేదని నిరూపిస్తున్న ఈ సుందరీమణుల లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్