పిల్లలు సరిగా నిద్ర పోవట్లేదా?

'లాలీ లాలీ లాలీ లాలీ..', 'లాలిజో లాలీజో.. వూరుకో పాపాయి..' ఇలా జోల పాటలు పాడితే నిద్రపోయే పిల్లలు ఈ సైబర్ జనరేషన్‌లో చాలా అరుదు. పైగా ఎదురు ఇలాంటి పాటలు పాడి వాళ్లు మనల్ని నిద్ర పుచ్చకపోతే అంతే చాలు! ఇంతకీ విషయమేంటంటే.. కొంతమంది పిల్లలు ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. కానీ మరికొందరైతే పడుకోబెట్టడానికి ఎన్ని....

Published : 09 Mar 2022 19:58 IST

'లాలీ లాలీ లాలీ లాలీ..', 'లాలిజో లాలీజో.. వూరుకో పాపాయి..' ఇలా జోల పాటలు పాడితే నిద్రపోయే పిల్లలు ఈ సైబర్ జనరేషన్‌లో చాలా అరుదు. పైగా ఎదురు ఇలాంటి పాటలు పాడి వాళ్లు మనల్ని నిద్ర పుచ్చకపోతే అంతే చాలు! ఇంతకీ విషయమేంటంటే.. కొంతమంది పిల్లలు ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. కానీ మరికొందరైతే పడుకోబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు నిద్రపోరు. పిల్లలు ఇలా నిద్ర పోకుండా మెలకువతో ఉండడానికి రకరకాల కారణాలుంటాయి. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం..

పగటి నిద్ర తక్కువగా..

ఐదు సంవత్సరాల వయసొచ్చే వరకు చాలామంది పిల్లలు పగలు భోజనం చేసిన తర్వాత నిద్ర పోతారు. దీంతో రాత్రి సరిగ్గా నిద్ర పోరు. కాబట్టి పగటి పూట కొద్ది సేపే పడుకునేలా చేస్తే రాత్రుళ్లు వాళ్లు హాయిగా నిద్ర పోయే అవకాశం ఉంది.

గురక పెట్టడం..

చాలామంది పిల్లలు జలుబు, సీజనల్ అలర్జీ.. వంటి రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల గురక పెడుతుంటారు. ఈ గురక వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై మధ్యమధ్యలో మేల్కొంటారు. కాబట్టి పిల్లలు గురక పెట్టకుండా నిద్ర పోతున్నారంటే వాళ్లు ప్రశాంతంగా నిద్ర పోతున్నారని అర్థం.

ఆరోగ్యం బాలేదా?

పిల్లలు రాత్రుళ్లు సరిగా నిద్ర పోకపోవడానికి అనారోగ్యం కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు జలుబు చేసినప్పుడు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయాల్లో నిద్రాభంగం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు ఆస్తమా, అలర్జీల వల్ల కూడా నిద్రలేమితో సతమతమవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారి ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించి, అవసరమైతే వైద్యుని సంప్రదించడం అవసరం.

గ్యాడ్జెట్లకు దూరంగా..

ఈ తరం పిల్లలు కంప్యూటర్లు, మొబైల్స్, వీడియో గేమ్స్, టీవీలతో ఎక్కువగా చెలిమి చేస్తారు. కాబట్టి పడుకునే సమయంలో పిల్లల రూంలో ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రాత్రంతా కూర్చుని టీవీ చూడటమో, గేమ్స్ ఆడడమో చేస్తుంటారు. ఫలితంగా సరిగా నిద్రపోలేరు.

టాన్సిల్స్ వల్ల..

కొంతమంది పిల్లలు టాన్సిల్స్ సమస్యతో బాధపడుతుంటారు. వీళ్లకు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు. దీంతో మధ్యమధ్యలో మెలకువ వచ్చి సరిగ్గా నిద్ర పోరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్