మా పాపకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా ఎప్పుడు వేయించాలి?

నమస్తే మేడం. మా పాపకు ఇప్పుడు 13 ఏళ్లు. ఇంకా మెచ్యూర్‌ కాలేదు. తనకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేయించడానికి ఏది సరైన సమయం? మా కుటుంబంలో క్యాన్సర్‌ మూలాలున్నాయి. మా అత్తగారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో చనిపోయారు.

Updated : 08 Sep 2022 17:01 IST

నమస్తే మేడం. మా పాపకు ఇప్పుడు 13 ఏళ్లు. ఇంకా మెచ్యూర్‌ కాలేదు. తనకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేయించడానికి ఏది సరైన సమయం? మా కుటుంబంలో క్యాన్సర్‌ మూలాలున్నాయి. మా అత్తగారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. నా భార్య కొవిడ్‌ అనంతర సమస్యలతో (RHNO Sinusitis) చనిపోయింది. వంశపారంపర్యంగా ఎలాంటి సమస్యలు రాకూడదంటే మా పాపకు వేయించాల్సిన వ్యాక్సిన్లు ఇంకా ఏమున్నాయో సలహా ఇవ్వగలరు.

జ: సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేయించడానికి పుష్పవతి కావడంతో సంబంధం లేదు. దీన్ని 9-12 సంవత్సరాల మధ్య వేయించాలి. మీ పాపకు ఇప్పటికే 13 ఏళ్లంటున్నారు కాబట్టి వెంటనే వేయించండి. మీ కుటుంబంలో క్యాన్సర్‌ మూలాలున్నాయని భయపడుతున్నారు. వీటి కోసం పాప వయసు పెరుగుతున్న కొద్దీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

కౌమార దశలో ఆడపిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్లు.. TDAP, హెపటైటిస్‌ బి, ఎంఎంఆర్‌.. ఇవన్నీ బూస్టర్‌ డోసులు ఇప్పించాలి. అలాగే సీజనల్‌ వ్యాక్సిన్లు అంటే.. ఇన్ఫ్లుయెంజా, కొవిడ్, Meningitis, హెపటైటిస్‌ ‘ఎ’, టైఫాయిడ్‌, చికెన్‌ పాక్స్‌.. వంటివన్నీ ఆయా జబ్బులు ప్రబలంగా ఉన్న సమయంలో వేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్