అందాల తారల ‘ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌’.. చూశారా?!

ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌ మనకే కాదు.. అందాల తారలకూ ఉంటుంది. తమ అభిమాన సెలబ్రిటీల్ని కలిసే అవకాశమొస్తే.. ఫొటోలు, సెల్ఫీలతో తెగ సందడి చేసేస్తారు. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటారు.

Updated : 17 Nov 2023 19:10 IST

(Photos: Instagram)

ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌ మనకే కాదు.. అందాల తారలకూ ఉంటుంది. తమ అభిమాన సెలబ్రిటీల్ని కలిసే అవకాశమొస్తే.. ఫొటోలు, సెల్ఫీలతో తెగ సందడి చేసేస్తారు. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటారు. ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ను కలుసుకోవడానికి, ఆయనతో కలిసి ఫొటోలు దిగడానికి అలాగే ఆసక్తి చూపారు పలువురు బాలీవుడ్‌ తారలు. ఇటీవలే జరిగిన ఇండియా-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరైన డేవిడ్‌కు.. బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ దంపతులు తాజాగా డిన్నర్‌ పార్టీ ఏర్పాటుచేశారు. ఈ పార్టీకి పలువురు బాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. ఈ ఫుట్‌బాల్‌ లెజెండ్‌తో కలిసి ఫొటోలు దిగుతూ తమ ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

డేవిడ్‌ బెక్‌హామ్‌.. ఫుట్‌బాల్‌ ప్రియులకు ఈ పేరు సుపరిచితమే! ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన డేవిడ్‌.. ఇటీవలే జరిగిన ఇండియా-న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఆయన.. అదే జెర్సీతో మైదానంలో మ్యాచ్‌కు హాజరయ్యాడు. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి ఆయన మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేసిన తీరు.. మ్యాచ్‌ ఆసాంతం పదే పదే కెమెరా కంటికి చిక్కింది.

ముద్దుగుమ్మల మెరుపుల్‌!

అయితే మ్యాచ్‌ అనంతరం బాలీవుడ్‌ అందాల తార సోనమ్‌ కపూర్‌, ఆమె భర్త ఆనంద్‌ అహుజా డేవిడ్‌ను విందుకు ఆహ్వానించారు. ముంబయిలోని సోనమ్‌-ఆనంద్‌ల నివాసంలో ఈ పార్టీ ఏర్పాటుచేశారు. ఈ విందులో కపూర్‌ ఫ్యామిలీతో పాటు పలువురు బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో సోనమ్‌ ట్రెడిషనల్‌గా మెరిసిపోయింది. ఎరుపు రంగు చీరను ఎంచుకున్న ఆమె.. దానికి మ్యాచింగ్‌గా క్రీమ్‌ కలర్‌ కాఫ్తాన్‌ బ్లౌజ్‌ను ధరించింది. తన అటైర్‌కు జతగా చోకర్‌ నెక్లెస్‌ను ఎంచుకున్న ఈ సొగసరి.. బన్‌ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తిచేసింది. ఇక సోనమ్‌ భర్త ఆనంద్‌ కుర్తా-పైజామాలో ట్రెడిషనల్‌గా కనిపించాడు. ఇక ఈ పార్టీకి మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌గా రడీ అయి హాజరైన డేవిడ్‌తో కలిసి ఈ జంట ఫొటోలు దిగుతూ సందడి చేసింది. ఈ పార్టీలో కరిష్మా కపూర్‌, మలైకా అరోరా-అర్జున్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌-షాహిద్‌ కపూర్‌, షనాయా కపూర్‌, రియా కపూర్‌.. తదితర తారలు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయారు. తమ అభిమాన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డేవిడ్‌తో కలిసి ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫరెవర్‌ ఫ్యాన్‌’, ‘టీనేజ్‌ క్రష్‌’ అంటూ తమ ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఇలా సోనమ్‌ ఇంట్లో పార్టీ ముగిశాక.. బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌, అంబానీ కుటుంబం ఆతిథ్యాన్ని కూడా అందుకున్నాడీ ఫుట్‌బాల్‌ స్టార్‌. వాళ్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, మన బాలీవుడ్‌ తారల ఫ్యాన్‌ గర్ల్‌ మొమెంట్‌ని మీరూ చూసేయండి!









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్