కప్పుకో జేబు!

సాయంత్రమైనా, ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినా కప్పు కాఫీ లేదా టీ ఇవ్వడం మన సంప్రదాయం. అయితే కొంతమంది టీ/కాఫీతో పాటు బిస్కట్స్‌, కుకీస్‌, రస్క్‌.. వంటి కాంబినేషన్స్‌ కూడా అందిస్తుంటారు. దానికోసం ప్రత్యేకంగా ఓ ప్లేట్‌/సర్వింగ్‌ బౌల్‌ని ఉపయోగిస్తారు. మరి, ఆ అవసరం లేకుండా కాస్త ప్రత్యేకంగా అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలంటే.. అందుకు హోల్డర్‌/పాకెట్‌ జతచేసిన కాఫీ మగ్స్‌/కప్స్‌ ప్రస్తుతం.....

Published : 06 Apr 2022 16:45 IST

సాయంత్రమైనా, ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినా కప్పు కాఫీ లేదా టీ ఇవ్వడం మన సంప్రదాయం. అయితే కొంతమంది టీ/కాఫీతో పాటు బిస్కట్స్‌, కుకీస్‌, రస్క్‌.. వంటి కాంబినేషన్స్‌ కూడా అందిస్తుంటారు. దానికోసం ప్రత్యేకంగా ఓ ప్లేట్‌/సర్వింగ్‌ బౌల్‌ని ఉపయోగిస్తారు. మరి, ఆ అవసరం లేకుండా కాస్త ప్రత్యేకంగా అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలంటే.. అందుకు హోల్డర్‌/పాకెట్‌ జతచేసిన కాఫీ మగ్స్‌/కప్స్‌ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో వేడివేడి టీ పోసి.. ఆ పక్కనే ఉన్న జేబులో మీరు అందించాలనుకుంటోన్న స్నాక్స్‌ని అమర్చి సర్వ్‌ చేస్తే ప్రత్యేకంగా, వెరైటీగా ఉంటుంది.

ఇలా జేబుల మాదిరిగానే కాకుండా.. కప్పు కింది భాగంలో అరలా ఉండే మగ్స్‌, బ్రెడ్‌-బన్‌ వంటివి సర్వ్‌ చేయడానికి వీలుగా ఉండేలా చిన్నపాటి ట్రే జతచేసిన మగ్స్‌, సూప్స్‌-క్రాకర్‌ మగ్స్‌.. వంటివి కూడా విభిన్న డిజైన్లలో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. భలేగున్నాయి కదా ఈ వెరైటీ కప్స్‌! అయితే ఆలస్యమెందుకు.. వీటిని మన వంటింట్లో చేర్చుకొని.. అతిథుల్ని సర్‌ప్రైజ్‌ చేసేద్దామా?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్