బర్గర్‌ కాదు.. లంచ్‌ బాక్స్!

పిల్లలకు ప్రతిదీ ప్రత్యేకంగానే ఉండాలి. ఆడుకునే బొమ్మల దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. అన్నింట్లోనూ అందరికంటే భిన్నంగా ఉన్న వాటినే ఎంచుకుంటుంటారు. తల్లులు కూడా చిన్నారుల ఇష్టానికే ప్రాధాన్యమిస్తుంటారు కూడా! అలా పిల్లలు ఇష్టపడే వస్తువుల్లో ఇప్పుడు లంచ్‌బాక్స్‌లు కూడా చేరిపోయాయి.

Published : 23 Aug 2023 21:05 IST

పిల్లలకు ప్రతిదీ ప్రత్యేకంగానే ఉండాలి. ఆడుకునే బొమ్మల దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. అన్నింట్లోనూ అందరికంటే భిన్నంగా ఉన్న వాటినే ఎంచుకుంటుంటారు. తల్లులు కూడా చిన్నారుల ఇష్టానికే ప్రాధాన్యమిస్తుంటారు కూడా! అలా పిల్లలు ఇష్టపడే వస్తువుల్లో ఇప్పుడు లంచ్‌బాక్స్‌లు కూడా చేరిపోయాయి.

స్కూలుకెళ్లే పిల్లలు లంచ్‌బాక్స్‌ ఖాళీ చేసేయడం అరుదు. చాలామంది సగం ఆహారం మిగిల్చే ఇంటికి తీసుకొస్తుంటారు కూడా! అలాంటి పిల్లలకు ఇలాంటి వెరైటీ లంచ్‌ బాక్సుల్లో భోజనం పెట్టి పంపిస్తే సరి.. ఒక్క మెతుకైనా మిగల్చకుండా తింటారంటే నమ్మండి! ఈ వెరైటీ లంచ్‌ బాక్సులు ఇప్పుడు బోలెడన్ని డిజైన్లలో తయారై పిల్లల మనసు దోచుకుంటున్నాయి.

ముఖ్యంగా.. బర్గర్‌ను పోలి ఉన్నది, పిల్లలు నీళ్లు తాగే బాటిల్‌ ఆకృతిలో ఉన్నది, పప్పీ డాగ్‌ ముఖాన్ని పోలి ఉన్నది, స్ట్రాబెర్రీ వంటి పండ్ల ఆకృతుల్లో ఉన్న బాక్సులు, మిక్కీ మౌస్‌, ఎమోజీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని డిజైన్లలో ఇవి లభ్యమవుతున్నాయి. వీటిలోనూ అన్నం, కూర, స్నాక్స్‌, సలాడ్స్‌.. ఇలా దేనికదే సెక్షన్ల మాదిరిగా విభజించినవీ దొరుకుతున్నాయి. అయితే బయటివైపు ప్లాస్టిక్‌తో తయారుచేసినా.. లోపలి భాగం స్టీల్‌తో తయారైవని ఎంచుకోవడం మంచిది. మరి, పిల్లలు మెచ్చే అలాంటి కొన్ని వెరైటీ లంచ్‌ బాక్సుల్ని ఇక్కడ చూసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని