కట్ చేసినా తాజాగా ఉండాలంటే..!

ఆరోగ్యంగా ఉండడానికి తాజా కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇవి తాజాగా ఉన్నప్పుడు తీసుకుంటేనే శ్రేయస్కరం. కానీ కొన్ని పండ్లు, కూరగాయలు కట్ చేసిన తర్వాత కాసేపటికే అవి రంగు మారిపోవడం, వడలిపోయినట్లుగా కనిపించడం.. వంటివి జరుగుతుంటాయి. అలాగని వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టినా....

Published : 25 Mar 2022 17:10 IST

ఆరోగ్యంగా ఉండడానికి తాజా కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇవి తాజాగా ఉన్నప్పుడు తీసుకుంటేనే శ్రేయస్కరం. కానీ కొన్ని పండ్లు, కూరగాయలు కట్ చేసిన తర్వాత కాసేపటికే అవి రంగు మారిపోవడం, వడలిపోయినట్లుగా కనిపించడం.. వంటివి జరుగుతుంటాయి. అలాగని వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో- కట్ చేసిన పండ్లు, కూరగాయల ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉండేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

నిమ్మరసంతో..

కట్ చేసుకున్న పండ్లను రకాలను బట్టి విభజించి వేర్వేరు బాక్సుల్లో వేయాలి. వాటి మీద కొద్దిగా నిమ్మరసం పిండి పండ్లపై పరుచుకునేలా చేయాలి. ఇప్పుడు ఈ బాక్సును ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల పండ్ల ముక్కలు దాదాపు నాలుగు నుంచి ఆరు గంటల పాటు తాజాగా ఉంటాయి.

ఐస్ ముక్కలతో..

కట్ చేసుకున్న పండ్ల ముక్కలను రకాన్ని బట్టి విభజించి వేర్వేరు బౌల్స్‌లోకి తీసుకోవాలి. తర్వాత వాటిలో కొద్దిగా ఐస్‌ముక్కలు, చల్లని నీళ్లు పోయాలి. ఈ విధంగా భద్రపరిచిన పండ్ల ముక్కలు దాదాపు 4 గంటల వరకు తాజాగా ఉంటాయి.

ఫాయిల్/ ప్లాస్టిక్ కవర్స్‌తో..

పండ్ల ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని దానిని ఒక ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేయాలి. అయితే పండ్లు ఎక్కువ సమయం తాజాగా నిలవాలంటే వాటికి గాలి తగలడం తప్పనిసరి. కాబట్టి ప్లాస్టిక్ కవర్/ ఫాయిల్‌కి చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. అనంతరం వీటిని ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అయితే ఈ పద్ధతిలో భద్రపరిచిన పండ్లు అంత ఎక్కువ సమయం తాజాగా ఉండవు. దాదాపు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే అవి తాజాగా ఉంటాయి.

చల్లని నీళ్లలో..

కట్ చేసిన యాపిల్ కాసేపటికే రంగు మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లని నీళ్లు పోయాలి. నిమిషం తర్వాత ఆ బౌల్‌పై మూత పెట్టి బాగా షేక్ చేయాలి. ఫలితంగా యాపిల్ ముక్కలన్నీ చల్లటి నీటిలో మునుగుతాయి. ఇప్పుడు వాటిని ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే సరి. అలాగే వాటిలోంచి పండ్లముక్కలు తీసిన ప్రతిసారీ దానిని బాగా షేక్ చేసి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ పద్ధతి కేవలం యాపిల్ ముక్కలకు మాత్రమే కాదు.. పియర్ పండ్లకు కూడా వర్తిస్తుంది.

ఇక వీటితో పాటు కోసిన పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని పేపర్ టవల్స్‌లో చుట్టి పెట్టడం, గాలి చొరబడని ఎయిర్ టైట్ బాక్సుల్లో భద్రపరచడం వంటి చిట్కాలు కూడా పాటించవచ్చు. మరి కట్ చేసిన పండ్లు, కూరగాయల ముక్కలు తాజాగా ఉండాలంటే మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తారో contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్