parenting: ఏ వయసులో ఫోను ఇస్తున్నారు?
స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమయ్యాయి. ఆటలనుంచి చిన్న చిన్న లెక్కలు సైతం అందులోనే చేసే పరిస్థితి. ఫోన్ల ద్వారా పిల్లలు చాలా సమాచారం తెలుసుకోవచ్చు. నిజమే కానీ ఏ వయసులో పిల్లలకు ఫోను ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా!
స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమయ్యాయి. ఆటలనుంచి చిన్న చిన్న లెక్కలు సైతం అందులోనే చేసే పరిస్థితి. ఫోన్ల ద్వారా పిల్లలు చాలా సమాచారం తెలుసుకోవచ్చు. నిజమే కానీ ఏ వయసులో పిల్లలకు ఫోను ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా!
పిల్లలు ఫోను వినియోగించే సమయాన్ని నియంత్రణలో ఉంచాలి. అవసరం మేరకే వాడుకునేలా అలవాటు చేయాలి. అప్పుడే మిగతా విషయాలపైనా శ్రద్ధ పెట్టగలరు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన బిల్‌గేట్స్ వాళ్ల పిల్లలకు 14ఏళ్లు నిండే వరకూ ఫోను ఇవ్వలేదట.
బహుమతిగా.. పిల్లలకు పది లేదా పన్నెండేళ్లు వచ్చినప్పుడు మనం వాళ్లకు బహుమతిగా ఫోను కొనివ్వొచ్చు. ఆ వయసులోనే వారు సంభాషణలు పూర్తిగా అర్థం చేసుకోగలరు. అలాంటప్పుడు ఇస్తే ఉపయోగం ఉంటుంది.
బాధ్యతతో.. చదువుకునేటప్పుడు పిల్లలకు ఫోన్లు ఉపయోగపడతాయి. అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం. ఎంత సమయం, ఏమేం చూస్తున్నారన్న విషయం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతుండాలి. అలా అయితేనే పిల్లలు ఆన్‌లైన్ మోసాల వంటి వాటికి గురికాకుండా కాపాడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.