ఎవరికి ఏ లిప్‌స్టిక్‌ అంటే...

ఏదో ఒక లిప్‌స్టిక్‌ వేసుకోవడంలో కొత్తేముంటుంది. మనకు నప్పే రంగుని సరిగ్గా ఎంచుకోవడంలోనే ఉంది అసలు కిటుకంతా. ఆ చిట్కాలేంటో చూసేద్దామా మరి...

Updated : 09 Dec 2022 15:55 IST

ఏదో ఒక లిప్‌స్టిక్‌ వేసుకోవడంలో కొత్తేముంటుంది. మనకు నప్పే రంగుని సరిగ్గా ఎంచుకోవడంలోనే ఉంది అసలు కిటుకంతా. ఆ చిట్కాలేంటో చూసేద్దామా మరి.

* రంగు బాగా తక్కువగా ఉన్నవారికి మెరిసే గోధుమరంగూ, లేత గులాబీ, గోధుమ వర్ణాలు బాగుంటాయి. ఒకవేళ ఎరుపు రంగు ఎంచుకుంటుంటే అచ్చంగా అదే కాకుండా... కాస్త కాషాయం మేళవించినదై ఉండేలా చూసుకోవాలి.
* చామనఛాయకు దగ్గరగా ఉన్నవారికి ముదురు ఎరుపూ, లేత ముదురు గులాబీ, ముదురు కాషాయ రంగులు నప్పుతాయి. అయితే అచ్చంగా ఎరుపు రంగు ఉన్నదే ఎంచుకునేలా చూసుకోవాలి. గులాబీలో ఏదయినా బాగానే ఉంటుంది.
* గోధుమరంగులో ఉన్నవారు మరీ ముదురు లేదా మరీ ప్రకాశవంతమైనవి కాకుండా గులాబీ, కాషాయం, లేత ఛాయల్ని ప్రయత్నించొచ్చు. అలాగే వీరికి పీచ్‌, కాషాయం, ఎరుపూ కలిపిన రంగూలూ నప్పుతాయి.
* తెల్లగా ఉన్నవారు ఏది పడితే అది వాడొచ్చని అనుకుంటారు. కానీ సరికాదు. లేత గులాబీ, గోధుమ, లేత పీచ్‌ రంగులు వీరికి చక్కగా నప్పుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్