Winter Care: ఆ సమస్యలకు పరిష్కారాలివిగో..!

పొడిచర్మం, గడ్డిలాంటి జుట్టు... ఇలా చలికాలంలో ఎదురయ్యే సౌందర్య సమస్యలు చాలానే ఉంటాయి. మరి వాటికి పరిష్కారం ఏంటంటారా? ఇవిగో ఇవే..

Published : 25 Jan 2022 20:30 IST

పొడిచర్మం, గడ్డిలాంటి జుట్టు... ఇలా చలికాలంలో ఎదురయ్యే సౌందర్య సమస్యలు చాలానే ఉంటాయి. మరి వాటికి పరిష్కారం ఏంటంటారా? ఇవిగో ఇవే..

* గోరువెచ్చని నీటిలో కాసిన్ని పాలు పోసి ఆ నీటితో స్నానం చేయండి. పాలలోని సహజసిద్ధమైన లాక్టిక్‌ గుణాలు శరీరానికి నిగనిగలు తీసుకొస్తాయి.

* వారానికి ఒక్కసారైనా జుట్టుకి డీప్‌ కండిషనర్‌ని పట్టించాలి. లేకపోతే జుట్టు గడ్డిలా తయారవుతుంది.

* షాంపూకి బదులుగా అప్పుడప్పుడు డ్రై షాంపూతో అంటే శీకాకాయ పొడితో కానీ, కుంకుడుకాయ పొడితో కానీ తలస్నానం చేస్తే శిరోజాలు సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఉంటాయి. తద్వారా కురులు ఆరోగ్యంగా మారతాయి.

* మస్కారా, ఐ లైనర్‌ వంటివి వాడేటప్పుడు వాటర్‌ప్రూఫ్‌ రకం ఎంచుకుంటే మంచిది. ఫలితంగా చల్లగాలుల వల్ల మేకప్‌ పాడవకుండా ఉంటుంది.

* స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మంలో తేమ ఉండి రోజంతా తాజాగా కనిపిస్తారు.

* మేకప్‌లో భాగంగా వాడే బ్లష్‌ వంటివి పౌడర్‌ రూపంలో ఉండేవి కాకుండా క్రీం రూపంలో ఉన్నవి వాడితే ముఖంపై చక్కగా కుదురుకుంటాయి. లేదంటే పౌడర్ పైకి కనిపిస్తూ మేకప్ ఎబ్బెట్టుగా ఉంటుంది.

* కాఫీ, టీ తాగే అలవాటును అదుపులో ఉంచుకోండి. లేకపోతే ఆ ప్రభావం మీ చర్మంపై పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్