బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 11:30 IST

TS: గ్రూప్‌-1 ప్రిలిమినరీ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అక్టోబరు 16 నాటి పరీక్ష కోసం డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లు ఇప్పుడు పనిచేయవని, తాజాగా మళ్లీ తీసుకోవాలని సూచించింది. https://www.tspsc.gov.in/ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. జూన్‌ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

మరిన్ని

తాజా వార్తలు