close
అప్పటి ముచ్చట్లు


సావిత్రి పక్కన కూర్చుంటే వణికిపోయేవారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మహానటి’ కంటె పెద్ద మాటని ఉపయోగించదగిన వ్యక్తి సావిత్రి. తన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే ఆమె ఎన్నో మరుపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. కానీ, ఆమె జీవితం విషాదాంతం. అయితే సావిత్రికి బాగా దగ్గరిగా చూసినవాళ్లు మాత్రం ఆమెను ఎన్నటికీ మర్చిపోలేరు.

‘‘సావిత్రికి ఎడమ చేతివాటం. రాయడం, సంతకాలు చేయడం అన్నీ ఎడమ చేతితోనే చేసేవారు. ఆమె కారును అత్యంత వేగంగా నడిపేవారు. ‘నర్తనశాల’ (1963) చిత్రానికి ఆమె మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి రెండు వరకూ పనిచేసేవారు. కారుకి డ్రైవరున్నా కూడా ఆమే స్వయంగా నడుపుకొంటూ వచ్చేవారు. షూటింగ్‌ పూర్తయ్యే సరికి రాత్రి 2 గంటలు దాటిపోయేది. ఇంటికి ఒక్కరినే పంపడం ఎందుకని చిత్ర బృందం ఎవరినైనా సహాయంగా పంపేది. అయితే సావిత్రి పక్కన కూర్చొని ఆమె డ్రైవింగ్‌ను చూసేవాళ్లకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. భయంతో వణికిపోయేవారు. అంత వేగంగా ఆమె కారును నడిపేవారు. ‘రాత్రి, ట్రాఫిక్‌ ఉండదనా? ఇంత స్పీడుగా నడుపుతున్నారు?’ అని అడిగితే, ‘లేదు, అవకాశం ఉన్నప్పుడల్లా వేగంగానే నడుపుతాను’ అంటూ చిరు నవ్వుతో సమాధానం ఇచ్చేవారట. భరణి స్టూడియోలో షూటింగు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి సావిత్రి ఇంటికి వెళ్లడానికి ప్రొడక్షన్‌ వారి కారుకి సుమారు 40 నిమిషాలు పట్టేది. అదే సావిత్రి 20 నిమిషాల్లో డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయేవారు! అదీ ఆమె వేగం’’ అంటారు ఆమెను దగ్గరగా చూసినవాళ్లు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.