కర్లీ హెయిర్.. గడ్డిలా మారుతోంది.. ఏం చేయాలి?

హలో మేడమ్.. నాకు ఇరవయ్యేళ్లు. చిన్నప్పట్నుంచీ నా హెయిర్ చాలా కర్లీ. దానివల్ల జుట్టంతా చింపిరిగా, చెదిరిపోయినట్లు కనిపిస్తుంది. చిక్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నూనె పెట్టుకున్నా కూడా కేశాలు పైకి లేస్తుంటాయి. ఇక తలస్నానం చేసినప్పుడైతే జుట్టంతా గడ్డిలా.....

Published : 19 Aug 2022 21:01 IST

హలో మేడమ్.. నాకు ఇరవయ్యేళ్లు. చిన్నప్పట్నుంచీ నా హెయిర్ చాలా కర్లీ. దానివల్ల జుట్టంతా చింపిరిగా, చెదిరిపోయినట్లు కనిపిస్తుంది. చిక్కులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నూనె పెట్టుకున్నా కూడా కేశాలు పైకి లేస్తుంటాయి. ఇక తలస్నానం చేసినప్పుడైతే జుట్టంతా గడ్డిలా మారి, విపరీతంగా చిక్కులు పడుతోంది. నాది చాలా పొడవైన జుట్టు. కానీ ఈ సమస్య వల్ల ఇప్పుడు సగానికి సగం వూడిపోయింది. నేను ఎలాంటి ఉత్పత్తులు ఉపయోగించాలి? కండిషనర్స్ ఉపయోగించడం వల్ల సమస్యకి ఏమైనా పరిష్కారం లభిస్తుందా? ఎలాంటి షాంపూ, కండిషనర్స్ ఉపయోగించాలి? - ఓ సోదరి

జుట్టు బాగా కర్లీగా ఉందంటున్నారు కాబట్టి సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించి దాని నుంచి ఉపశమనం పొందచ్చు.

కావాల్సినవి:

కలబంద గుజ్జు- ఒక కప్పు

నీళ్లు - ఒక కప్పు

మందారాకుల పేస్ట్- అరకప్పు

మెంతుల పేస్ట్- అరకప్పు

తయారీ:

కలబంద గుజ్జు, నీళ్లు సమపాళ్లలో తీసుకోవాలి. దానిలో మందారాకులు, మెంతుల పేస్ట్‌లు కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చొప్పున మూడు లేదా నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా అప్త్లె చేస్తే జుట్టు ఉంగరాలుగా తిరగడం తగ్గి, నార్మల్ హెయిర్‌లా కనిపిస్తుంది.

మీరు హెర్బల్ ఆధారిత షాంపూలను ఉపయోగించడం మంచిది. ఈ మిశ్రమం కండిషర్‌లా పని చేస్తుంది కాబట్టి ప్రత్యేకించి కండిషనర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే జుట్టు ఉంగరాలు తిరగడం తగ్గే కొద్దీ చిక్కులు పడడం కూడా క్రమేపీ తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్