Updated : 09/10/2021 20:59 IST

అలాంటి బుల్లీయింగ్ నేనూ ఎదుర్కొన్నా..!

(Photo: Instagram)

బాల్యం... కొందరికి జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాలను బహమతిగా అందిస్తుంది. మరికొందరికి ఎప్పుడెప్పుడు మరిచిపోదామా? అనిపించే చేదు అనుభవాలను మిగుల్చుతుంది. బాలీవుడ్‌ బుల్లితెర నటి సనాయా ఇరానీ ఈ రెండో కోవకే చెందుతుంది. పలు టీవీ సీరియల్స్‌, రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చర్మఛాయకు సంబంధించి బాల్యంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొందట. తోటి విద్యార్థుల చేతిలో హేళనకు గురైందట.

ముంబయిలో పుట్టి పెరిగిన సనాయా ఊటీ బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆమిర్ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన ‘ఫనా’ సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. షారుఖ్‌ ఖాన్‌, కరీనా వంటి ప్రముఖ స్టార్లతో కలిసి వివిధ టీవీ ప్రకటనల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ బుల్లితెర వైపు అడుగులు వేసింది. ‘మిలే జబ్‌ హమ్‌ తుమ్‌’ ధారావాహికలో గుంజన్ పాత్రతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. పలు హిట్‌ సీరియల్స్తో పాటు ‘ఝలక్‌ దిక్లాజా’, ‘నచ్‌ బలియే’ రియాలిటీ షోలతో మరింత క్రేజ్‌ పెంచుకుంది.

తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నా!

తన అందం, అభినయంతో ‘ఈస్టర్న్-ఐ’ వంటి అంతర్జాతీయ మ్యాగజైన్‌ల గుర్తింపు పొందింది సనాయా. అయితే ఇప్పుడున్న క్రేజ్‌ను పక్కన పెడితే చిన్నతనంలో చాలామంది అమ్మాయిల్లాగే తాను కూడా ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానంటోందీ అందాల తార. ముఖ్యంగా తన స్కిన్‌టోన్‌కు సంబంధించి తోటి విద్యార్థుల చేతిలో హేళనకు గురయ్యానంటూ తన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది.

‘తెల్ల బొద్దింక’ అని ఎగతాళి చేసేవారు!

‘నేను ముంబయిలో పుట్టి పెరిగినా నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊటీలో సాగింది. అక్కడి బోర్డింగ్‌ స్కూల్‌లో ఏడేళ్లు చదువుకున్నాను. మాది జొరాస్ట్రియన్‌ ఫ్యామిలీ. ముఖం కొంచెం ఎరుపు రంగులో ఉన్నా చాలా అందంగా ఉండేదాన్ని. అయితే తోటి విద్యార్థులకు మాత్రం నా స్కిన్‌టోన్ మరోలా కనిపించింది. వారు నన్ను చూసినప్పుడల్లా బల్లి, తెల్ల బొద్దింక.. అంటూ ఎగతాళి చేశారు. ఇక్కడ విషయమేమిటంటే...వారి కంటే నేను పదిరెట్లు అందంగా కనిపించేదాన్ని. అయినా నాపై కామెంట్లు చేసేవారు’..

నా రంగు చూసి...

‘ఇంకో సందర్భంలో ఒక గుజరాతీ ఫ్యామిలీ నా కలర్‌ను చూసి హేళన చేసింది. ఒకసారి స్కూల్‌లో నేను ఐస్‌క్రీం తింటున్నప్పుడు వారు నా సమీపంలోనే కూర్చున్నారు. మాటల మధ్యలో నన్ను చూసి ‘హే...ఒకసారి ఆ పిల్లను చూడండి... అచ్చం కోతిలా లేదూ’ అని ఎగతాళి చేశారు.  నాకు గుజరాతీ అర్థం కాదనే వారు అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అయితే నాకు గుజరాతీ వచ్చనే విషయం వారికి తెలియదు. నా ఎర్రటి ముక్కు, బుగ్గలను చూసే వారు అలా మాట్లాడారని నాకు అర్థమైంది. ఇలాంటి అవమానాల వల్ల ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడేదాన్ని కాదు. నలుగురిలో కలిసేందుకు భయపడేదాన్ని. అయితే ఎదిగే కొద్దీ ఇలాంటి విమర్శలు, అవమానాల గురించి పట్టించుకోవడం మానేశాను.. నా లక్ష్యాల పైన మాత్రమే దృష్టి సారించాను..’ అని గుర్తుకు తెచ్చుకుందీ బుల్లితెర బ్యూటీ.

సో.. ప్రత్యేకించి టీనేజ్ లో ఇలాంటి బుల్లీయింగ్ దాదాపు అందరికీ ఎదురయ్యేదే.. అలాగని ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదు.. వాళ్ల విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మన లక్ష్యం మీద ఫోకస్ చేసి మనం ఏమిటో మనం సాధించే విజయాల ద్వారానే నిరూపించాలి.. అంటోంది సనాయా. నూటికి నూరుపాళ్లూ నిజం కదూ!  మరి అమ్మాయిలూ వింటున్నారా?


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి