Kitchen Gadgets : చేతులు కాలవిక!

వంటగదిలో స్టౌ మీద నుంచి వేడి గిన్నెలు దించడానికి, వేడి పాత్రల్ని తాకేటప్పుడు క్లాత్స్‌ ఉపయోగించడం మనకు అలవాటే! అయితే ఒక్కోసారి వాటిని ఉపయోగించినా చేతులు కాలుతుంటాయి. పైగా ఆ క్లాత్స్‌ని పదే పదే శుభ్రం చేయడమూ కుదరకపోవచ్చు. అందుకే ఆ పనిని సులభతరం....

Published : 26 Mar 2023 12:53 IST

వంటగదిలో స్టౌ మీద నుంచి వేడి గిన్నెలు దించడానికి, వేడి పాత్రల్ని తాకేటప్పుడు క్లాత్స్‌ ఉపయోగించడం మనకు అలవాటే! అయితే ఒక్కోసారి వాటిని ఉపయోగించినా చేతులు కాలుతుంటాయి. పైగా ఆ క్లాత్స్‌ని పదే పదే శుభ్రం చేయడమూ కుదరకపోవచ్చు. అందుకే ఆ పనిని సులభతరం చేస్తూ, చేతులు కాలకుండా వేడి గిన్నెల్ని పట్టుకోవడానికి వీలుగా ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి సరికొత్త ‘మిటెన్‌ గ్లోవ్స్‌’.

సిలికాన్‌, కాటన్‌, పాలిస్టర్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారైన ఈ గ్లోవ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో, డిజైన్లలో లభ్యమవుతున్నాయి. ఇవి వంద శాతం ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. వీటి సహాయంతో స్టౌ పైనుంచి వేడి గిన్నెల్ని దించడమే కాదు.. అవెన్‌లో బేకింగ్‌ ట్రేలు, పాత్రలు పెట్టేటప్పుడు, తీసేటప్పుడు వాడచ్చు.. అలాగే గ్రిల్‌ చేసేటప్పుడు చేతులు కాలకుండా కూడా వీటిని ధరించచ్చు. వీటిలో కొన్ని రకాల గ్లోవ్స్‌కి అరచేతి వైపు బొడిపెల్లాంటి ఉపరితలం ఉంటుంది. పండ్లు, కాయగూరల్ని శుభ్రం చేసేటప్పుడు రుద్ది మరీ కడగడానికి ఇలాంటి గ్లోవ్స్‌ని ఉపయోగించచ్చు. అంతేకాదు.. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు పదే పదే చేతులు నీటిలో తడవకుండా కూడా వీటిని వేసుకోవచ్చు. ఇక వీటిని ధరించి మరుగుతున్న నీటిలో నుంచి గుడ్లు, ఇతర కాయగూరల్నీ వేరు చేయచ్చు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఈ మిటెన్‌ గ్లోవ్స్‌ని శుభ్రం చేయడమూ సులభమే!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్