రుబెల్లా ఉంటే పుట్టబోయే బిడ్డకు అవకరాలొస్తాయా?
నమస్తే డాక్టర్. నేను గత ఆరు నెలలుగా రుబెల్లా కోర్స్ వాడుతున్నాను. ఈ సమయంలో నేను గర్భం ధరించడం మంచిదా? కాదా? దయచేసి చెప్పండి.
నమస్తే డాక్టర్. నేను గత ఆరు నెలలుగా రుబెల్లా కోర్స్ వాడుతున్నాను. ఈ సమయంలో నేను గర్భం ధరించడం మంచిదా? కాదా? దయచేసి చెప్పండి.
- ఓ సోదరి
జ: రుబెల్లా లేదా జర్మన్ మీజిల్స్ అనేది మీజిల్స్ వ్యాప్తికి సంబంధించిన ఓ వైరల్ ఇన్ఫెక్షన్. దీనికి ఆరు నెలల పాటు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్సలేవీ ఉండవు. ఒకవేళ గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తే బిడ్డకు అవకరాలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే ఈ చికిత్సలో సాధారణంగా జరిగే పొరపాటేంటే.. రుబెల్లా యాంటీబాడీస్ కోసం పరీక్షలు చేస్తారు. ఈ క్రమంలో ఇది వరకే రుబెల్లా వచ్చి తగ్గిన వారికి IgG యాంటీబాడీలు పాజిటివ్ వస్తాయి. దీన్ని ఇన్ఫెక్షన్‌గా భ్రమపడి కొంతమంది దీర్ఘకాలం పాటు చికిత్స అందిస్తారు. కాబట్టి మీరు ఈ మాత్రల వాడకం ఆపేసి.. దీని గురించి అవగాహన ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.