కుటుంబ ఒత్తిడా..?

పిల్లలు, భర్త విషయాలకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది రమణి. ఇవన్నీ ఆమెను అనారోగ్యంలోకి నెట్టేయడంతో ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై పడింది. దీన్నే ఫ్యామిలీ స్ట్రెస్‌ అంటున్నారు నిపుణులు. వీలైనంత త్వరగా దీన్నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.

Published : 21 Mar 2023 00:12 IST

పిల్లలు, భర్త విషయాలకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది రమణి. ఇవన్నీ ఆమెను అనారోగ్యంలోకి నెట్టేయడంతో ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై పడింది. దీన్నే ఫ్యామిలీ స్ట్రెస్‌ అంటున్నారు నిపుణులు. వీలైనంత త్వరగా దీన్నుంచి బయటపడాలని సూచిస్తున్నారు.

ర్థికపరిస్థితి, వ్యాపారంలో నష్టం, ముందుకుసాగని పిల్లల చదువులు కారణాలేవైనా సరే.. ప్రభావం కుటుంబ సభ్యులందరి పైనా పడుతుంటుంది. అందులోంచి బయటపడటానికి అందరూ కలిసి ప్రయత్నించాలి. కుటుంబంలో ఏ ఒక్కరిపైనా భారమంతా వేయకూడదు. అలాగని ఎవరో ఒకరిని కారణంగా చూపించి నిందించకూడదు. ఒత్తిడికి దారి తీస్తున్న అంశాలను గుర్తించి వాటిపై అందరూ కలిసి చర్చించుకొంటే పరిష్కారం తప్పక దొరుకుతుంది.

పంచుకొంటే..

ఇంటి సభ్యులను ఒత్తిడి నుంచి బయటకు తేవడానికి పెద్దవాళ్లు సోషల్‌ సపోర్ట్‌ తీసుకోవడం మంచిది. స్నేహితులు, మనసుకు దగ్గరైన వ్యక్తులు లేదా శ్రేయోభిలాషులతో సమస్యను పంచుకొని, వారి నుంచి సహాయాన్ని తీసుకోవచ్చు. వారి వద్ద సలహా లేదా సూచనలు పొంది, వాటిని పాటిస్తే, పరిస్థితులు మెరుగుపడొచ్చు. అలాగే కుటుంబమంతా కలిసి వ్యాయామాలు చేయడం, నడక పేరుతో కలిసి బయటకు వెళ్లడం వంటివి శారీరక ఆరోగ్యాన్ని అందించడమే కాదు, మానసికాందోళన నుంచి బయటపడేలా చేస్తాయి. ఆ తర్వాత గతంలో ఒత్తిడికి గురైన విషయాలు కూడా తేలికగా కనిపించొచ్చు. వాటిని పరిష్కరించుకోగలమనే మానసిక స్థైర్యం పెరగొచ్చు. కుటుంబసభ్యుల మధ్య బలపడే అనుబంధాలు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకొనేలా చేస్తాయి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వింటూ, అవసరమైతే సానుభూతి చూపిస్తూ పరస్పరం సహాయం చేసుకొనేలా చేస్తాయి. ఒకరి నుంచి మరొకరికి తామున్నామంటూ భరోసా ఏర్పడటం మొదలవుతుంది. ఇవన్నీ అందరిలో ఒత్తిడిని తగ్గిస్తాయి. కుటుంబం తిరిగి బలోపేతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్