Monsoon Gadgets : ఈ దండేల్ని మడతెట్టేయచ్చు!
ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడం గగనం. పైగా ఎప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేం. ఇలాంటప్పుడు వర్షం పడట్లేదు కదా అని ఆరుబయట దుస్తులు ఆరేసి ఆఫీసుకు వెళ్లామంటే.. ఇంటికొచ్చే సరికి తడిసిపోతాయి. పైగా వాతావరణంలోని తేమకు దుస్తులు సరిగ్గా ఆరక అదో రకమైన వాసన....
ఈ వర్షాకాలంలో బట్టలు ఆరడం గగనం. పైగా ఎప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేం. ఇలాంటప్పుడు వర్షం పడట్లేదు కదా అని ఆరుబయట దుస్తులు ఆరేసి ఆఫీసుకు వెళ్లామంటే.. ఇంటికొచ్చే సరికి తడిసిపోతాయి. పైగా వాతావరణంలోని తేమకు దుస్తులు సరిగ్గా ఆరక అదో రకమైన వాసన కూడా వస్తుంటుంది. మరి, ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రస్తుతం విభిన్న రకాల క్లాత్ డ్రయింగ్ స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి.
వీటిని ఆరుబయట నీడలో లేదంటే ఇంట్లో గాలి ప్రసరణ ఎక్కువగా ఉండే చోట అమర్చుకోవచ్చు. అది కూడా గోడకు స్టాండ్ మాదిరిగా ఫిక్స్ చేసుకొని.. అవసరం ఉన్నప్పుడు బయటికి లాగి బట్టలు ఆరేసుకోవడం, మిగతా సమయాల్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, ఇలా స్థలాన్ని కూడా ఆదా చేస్తాయి ఇవి. ఈ ఫోల్డబుల్ స్టాండ్స్‌లోనూ పెద్ద పెద్ద దుస్తులు, లోదుస్తులు, హ్యాంగర్స్ వేలాడదీసుకునేలా.. ఇలా విభిన్న ఆప్షన్లు అమరి ఉన్నాయి. బెడ్‌షీట్లు, రగ్గులు.. వంటివి ఆరేసేందుకు అనువుగా గుండ్రంగా ఉండే లాండ్రీ హ్యాంగర్స్ సైతం దొరుకుతున్నాయి. ఎలాగూ ఇప్పుడు అందరూ వాషింగ్ మెషీన్ ఉపయోగిస్తున్నారు.. అందులోనే దుస్తులు చాలా వరకు డ్రై అవుతున్నాయి.. కాబట్టి వీటిని ఆరేసుకోవడానికి ఇలాంటి ఫోల్డబుల్ స్టాండ్స్‌ని ఎంచుకుంటే వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా నీడలోనే బట్టలు ఆరిపోతాయి. వాటిలోని విభిన్న మోడల్సే ఇవి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.