చిటికెడు చేరిస్తే...

ఒకప్పుడు పిల్లల్నుంచి పెద్దల వరకు ఏ ఆరోగ్య సమస్యైనా వంటింటి దినుసులపైనే ఆధారపడేవారు. వాటి నుంచి క్రమంగా పక్కకొచ్చి ప్రతిదానికీ మందులపై ఆధారపడటం సాధారణమైంది. వాటిల్లో

Published : 19 Sep 2021 18:19 IST

ఒకప్పుడు పిల్లల్నుంచి పెద్దల వరకు ఏ ఆరోగ్య సమస్యైనా వంటింటి దినుసులపైనే ఆధారపడేవారు. వాటి నుంచి క్రమంగా పక్కకొచ్చి ప్రతిదానికీ మందులపై ఆధారపడటం సాధారణమైంది. వాటిల్లో ఇంగువ ఒకటి. దీన్ని చిటికెడు తీసుకుంటే ప్రయోజనాలెన్నో!

ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులూ పరుగులూ. సమయానికి తినకపోవడం.. వెరసి చాలామంది ఆడ వాళ్లలో అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యొలొస్తుంటాయి. నెలసరి సమయంలోనూ ఈ ఇబ్బంది ఉంటుంది. రోజు వారీ ఆహారంలో ఇంగువ చేరిస్తే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.

పిల్లలను జంక్‌ ఫుడ్‌ నుంచి దూరం చేయడం కాస్త కష్టమే. కానీ ఇవి పరిధి మించితే కడుపునొప్పితో పాటు మలబద్ధకమూ దరిచేరుతుంది. వీరికి రోజుకోసారి భోజనానికి అరగంట ముందు పావు గ్లాసు నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగించండి. సమస్య దూరమవుతుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ ఇది మంచి మందు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్లు ఒక స్పూను ఇంగువకు తగినన్ని నీళ్లు చేర్చి పేస్టులా చేయాలి. దాన్ని గుండెపై పూతలా వేసి 2-3 గంటల పాటు ఉంచాలి. దీనిలోని ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్‌ గుణాలు శ్వాస సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్