వినయంతో విజయం

కొందరు పిల్లలు పెద్దవాళ్లతో అమర్యాదగా మాట్లాడటం, చేయి చేసుకోవడం వంటివి చూస్తుంటాం. దీన్ని వదిలేస్తే అదే వారి వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఆ తీరును మొదట్లోనే చక్కదిద్దాలంటున్నారు మానసిక నిపుణులు.

Updated : 26 Nov 2021 05:24 IST

కొందరు పిల్లలు పెద్దవాళ్లతో అమర్యాదగా మాట్లాడటం, చేయి చేసుకోవడం వంటివి చూస్తుంటాం. దీన్ని వదిలేస్తే అదే వారి వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఆ తీరును మొదట్లోనే చక్కదిద్దాలంటున్నారు మానసిక నిపుణులు. వారికి తర్ఫీదునిచ్చే మార్గాలను సూచిస్తున్నారిలా...

ఉద్యోగినులైన తల్లులకు తీరిక ఉండని మాట నిజమే అయినా రోజూ కొంత సమయం పిల్లల కోసం కేటాయించాలి. తెల్లటి కాన్వాస్‌ లాంటి పిల్లలను అందమైన చిత్రాలుగా తీర్చిదిద్దడం మన చేతిలోనే ఉంది. కాబట్టి, చిన్నప్పుడే మంచి లక్షణాలను అలవర్చండి. వయసుకు, విజ్ఞానానికి మర్యాద ఇవ్వాలంటూ మీరు ఆచరించి చూపండి, వాళ్లూ అనుసరిస్తారు.

* పెద్దల విలువను తెలియజేయండి. వాళ్ల అనుభవసారం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని, వినయంతోనే విజయాలు సాధ్యమని వివరించండి. పెద్దవాళ్లని తూలనాడి మాట్లాడటం ఎంత అధమ లక్షణమో, దాని వల్ల ఎన్ని అనర్థాలో కథలుగా చెప్పండి.

* సౌమ్యంగా ఉంటేనే అభిమానిస్తారు, ఆదరణ దొరుకుతుంది, ఎదురు తిరిగి మాట్లాడితే ఆత్మీయత చూపరు, ఒంటరితనంతో బాధపడాల్సి వస్తుందని అర్థమయ్యేలా చెప్పండి. అహంకారం కారణంగా పరాభవం చెందిన సంఘటనలూ సన్నివేశాలను కథల రూపంలో చెబితే పిల్లలెంతగానో ప్రభావితమవుతారు. పెద్దల పట్ల ప్రేమ పెంచుకుంటారు.

* పెద్దల్ని గౌరవించే పద్ధతులు చిన్నప్పుడే అలవాటు చేయకపోతే భవిష్యత్తులో మీతో సహా ఎవరినీ ఆదరించక అవస్థపెట్టి తామూ అలజడికి లోనవుతారని గుర్తుంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్