మోము మృదువుగా..

మృదుత్వానికి పూలనే ఉదాహరణ చెబుతాం. వాటితో మన అందాన్నీ పెంచుకోవచ్చు. అదెలాగో.. చదివేయండి. మందారం... పూలను నీడలో రెండు, మూడు రోజులు ఆరనిచ్చి ఎండాక పొడి చేసుకొని భద్రపరుచుకోవాలి. అరకప్పు ఓట్స్‌కు చెంచా ఈ పొడి, రెండు చెంచాల గులాబీ నీటిని కలిపి.. మిశ్రమాన్ని ముఖానికి...

Updated : 04 Mar 2022 05:26 IST

మృదుత్వానికి పూలనే ఉదాహరణ చెబుతాం. వాటితో మన అందాన్నీ పెంచుకోవచ్చు. అదెలాగో.. చదివేయండి.

మందారం... పూలను నీడలో రెండు, మూడు రోజులు ఆరనిచ్చి ఎండాక పొడి చేసుకొని భద్రపరుచుకోవాలి. అరకప్పు ఓట్స్‌కు చెంచా ఈ పొడి, రెండు చెంచాల గులాబీ నీటిని కలిపి.. మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంటయ్యాక కడిగేయండి. రెండు చెంచాల మందారపూల పొడికి సరిపడా కలబంద గుజ్జును కలిపి ముఖమంతా పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. చెంచా చొప్పున తేనె, పాలను తీసుకొని, రెండు చెంచాల మందారపొడి కలపాలి. ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ పూలలో ఉండే విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పిగ్మెంటేషన్‌, మచ్చలను దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ముఖాన్ని మృదువుగానూ మారుస్తుంది.

చామంతి... దీనిలోనూ సి విటమిన్‌ పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి. చామంతి రేకలకు నీటిని కలిపి మెత్తగా చేయాలి. దీనికి చెంచా చిక్కటి కొబ్బరిపాలను కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చాలు.

గులాబీ.. రెండు తాజా గులాబీల రేకలకు చెంచా నీటిని కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దీనికి చెంచా చొప్పున పాలు, గ్లిజరిన్‌ కలిపి ముఖానికి లేపనంలా రాయాలి. అరగంట తర్వాత కడిగేయండి. సహజసిద్ధమైన నూనె గుణాలు చర్మాన్ని తాజాగా చేసి మాయిశ్చరైజర్‌లానూ పనిచేస్తాయి.

మల్లె.. సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చెంచా శనగపిండికి మెత్తగా చేసిన నాలుగైదు మల్లెల మిశ్రమం, తగినన్ని పాలు కలపాలి. ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి శుభ్రం చేసుకోవాలి. సహజ క్లెన్సర్‌గా పనిచేసి చర్మ రంధ్రాల్లోని మురికిని పోగొట్టి మృదువుగా మారుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్