మచ్చలు పోగొట్టే పుచ్చ...

వేసవిలో దాహార్తిని తీర్చే పుచ్చకాయ సౌందర్య పరిరక్షణలోనూ ముందుంటుంది. దీంతో చేసే లేపనాలు చర్మానికి మెరుపును అందించడంతోపాటు మొటిమలు, మచ్చలను దూరం చేస్తాయి.

Updated : 26 Mar 2022 04:43 IST

వేసవిలో దాహార్తిని తీర్చే పుచ్చకాయ సౌందర్య పరిరక్షణలోనూ ముందుంటుంది. దీంతో చేసే లేపనాలు చర్మానికి మెరుపును అందించడంతోపాటు మొటిమలు, మచ్చలను దూరం చేస్తాయి.

పోషకవిలువలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుచ్చకాయలో నిండుగా ఉండి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందులోని విటమిన్‌ ఎ చర్మరంధ్రాలను శుభ్రపరిచి వాటిలోని నూనె, మురికి వంటి వాటిని బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌ శాతాన్ని పెంచి మచ్చలను దూరం చేసే  శక్తి దీనికి ఉంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను దూరం చేస్తాయి.

పొడారే చర్మానికి... పావుకప్పు పుచ్చకాయ ముక్కలను తీసుకొని గుజ్జులా చేయాలి. ఇందులో రెండు చెంచాల పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ఈ లేపనం మాయిశ్చరైజర్‌గా  పనిచేసి, చర్మంలోని మృతకణాలను పోగొడుతుంది. తేమగుణంతోపాటు మెరుపునూ ఇస్తుంది.

జిడ్డు చర్మానికి... చెంచా తేనెకు రెండు చెంచాల పుచ్చకాయ ముక్కల పేస్టును కలిపి లేపనంలా రాసి పావుగంట ఆరనివ్వాలి. ఇది సహజటోనర్‌గా పని చేస్తుంది. ముఖచర్మం క్లెన్సింగ్‌ అయ్యి మృదువుగా మారుతుంది. జిడ్డు దూరమవుతుంది.

వృద్ధాప్య ఛాయలను... రెండు చెంచాల పుచ్చకాయ రసానికి సమపాళ్లలో మెత్తగా చేసిన అవకాడో గుజ్జును కలిపి ముఖం, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగితే, ఈ మిశ్రమంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మానికి సాగేగుణాన్నిచ్చి మృదువుగా మారుస్తాయి. గీతలు, ముడతలు దూరమవుతాయి.

మచ్చలకు.. సగం అరటిపండుని గుజ్జులా చేసి దాన్లో రెండు చెంచాల పుచ్చకాయ రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతోపాటు మెడకూ రాయొచ్చు. 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేసుకుంటే, ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. క్రమేపీ మచ్చలు పోతాయి. చర్మమూ మృదువుగా మారుతుంది.

నలుపుదనం... ఎండ, వేడి గాలుల వల్ల ఏర్పడే నలుపును ఈ రసంతో పోగొట్టుకోవచ్చు. రెండు చెంచాల కీరదోస గుజ్జుకు సమానంగా పుచ్చకాయరసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలాగి కడగాలి. ఇలా వారమంతా చేస్తే ముఖంలో మంచి మార్పు వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్