సరైన ఎంపిక ముఖ్యమే!

లోదుస్తులు చాలా ముఖ్యం. వాటిని తయారుచేసే వస్త్ర రకం (ఫ్యాబ్రిక్‌) అంతకంటే ముఖ్యం. బజారులో రకరకాల రంగుల్లో, డిజైన్లలో, ఫ్యాబ్రిక్‌లలో ఇవి లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో లాభనష్టాలేంటో తెలుసుకుంటే ఎంపిక సులువవుతుంది.

Published : 19 May 2022 00:55 IST

లోదుస్తులు చాలా ముఖ్యం. వాటిని తయారుచేసే వస్త్ర రకం (ఫ్యాబ్రిక్‌) అంతకంటే ముఖ్యం. బజారులో రకరకాల రంగుల్లో, డిజైన్లలో, ఫ్యాబ్రిక్‌లలో ఇవి లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో లాభనష్టాలేంటో తెలుసుకుంటే ఎంపిక సులువవుతుంది.

కాటన్‌... గాలి చక్కగా ఆడుతుంది. ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి కాపాడటమే కాదు, సౌకర్యంగానూ ఉంటుంది. చెమటను పీల్చి చర్మం ఇరిటేషన్‌కు గురికాకుండా చూస్తుంది.
లేస్‌...  స్టైలిష్‌గా ఉన్నా సింథటిక్‌ రకానికి చెందింది. బాగా కనిపించడమే కాకుండా తేలికగా ఉంటుంది. స్టైల్‌, ఫ్యాషన్‌ను నిరంతరం అనుసరించేవారికి చక్కగా నప్పుతుంది.
మిగతావాటిలా శరీరాన్ని పట్టి ఉండదు. చెమటనూ పీల్చుకోదు.

సిల్క్‌... చాలా మృదువుగా, సహజంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మ సమస్యలు రాకుండా చూడటమే కాకుండా రోజంతా సౌకర్యంగా ఉంటుంది. చాలా రంగులు, డిజైన్లలో లభిస్తాయి.
ధర మాత్రం చాలా ఎక్కువ. అందరి చర్మ తత్వాలకూ సరిపోదు.

లినెన్‌... బయోడిగ్రేడబుల్‌. వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. శుభ్రం చేయడమూ సులభమే. కాటన్‌ లోదుస్తుల కంటే దీన్ని చాలా మంది ఇష్టపడతారు.
కాటన్‌ కంటే కాస్త ఖరీదెక్కువ. డిజైన్లు తక్కువ.

స్పాండిక్స్‌... ఈ సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ను అండర్‌ వేర్‌ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఎన్ని సార్లు ఉతికినా మన్నుతుంది.
సింథటిక్‌ రకం కావడం వల్ల చెమటను అంతగా పీల్చుకోదు.

నైలాన్‌... సింథటిక్‌ రకానికి చెందిన దీన్ని రసాయన విధానంలో తయారు చేస్తారు. చాలా చౌక. బోలెడు డిజైన్లలోనూ దొరుకుతుంది, సాగే గుణం ఉండి బాగా మన్నుతుంది.
దీన్ని వాడిన చాలామందిలో చర్మ సమస్యలు కనిపించాయి.

సాటిన్‌... సిల్కు, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన ఇవి బోలెడు రంగులు, డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. సిల్కు దుస్తులు వేసుకున్న అనుభూతిని ఇస్తాయి.

* రోజంతా ధరిస్తే చాలా అసౌకర్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్