మొటిమల నొప్పా?

అందమైన ముఖంపై దిష్టిచుక్కల్లా మొటిమలు కనిపిస్తుంటేనే చిరాకు. అలాంటిది కొన్నిసార్లు నొప్పీ పెడుతుంటాయి. భరించలేక పోతున్నారా? ఈ చిట్కాలను పాటించేయండి.  సలిపినట్లుగా నొప్పి వస్తోంటే చాలామంది గిల్లుతుంటారు. అది పరిస్థితిని దిగజారుస్తుంది. కాబట్టి ఆ అలవాటు మానుకోండి. ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి...

Published : 28 Jun 2022 00:14 IST

అందమైన ముఖంపై దిష్టిచుక్కల్లా మొటిమలు కనిపిస్తుంటేనే చిరాకు. అలాంటిది కొన్నిసార్లు నొప్పీ పెడుతుంటాయి. భరించలేక పోతున్నారా? ఈ చిట్కాలను పాటించేయండి.

సలిపినట్లుగా నొప్పి వస్తోంటే చాలామంది గిల్లుతుంటారు. అది పరిస్థితిని దిగజారుస్తుంది. కాబట్టి ఆ అలవాటు మానుకోండి. ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి. ఆపై శుభ్రమైన వస్త్రంలో ఐస్‌ ఉంచి దాని మీద మృదువుగా 5 నుంచి 10 నిమిషాలపాటు అద్దండి. 15 నిమిషాలు విరామమిస్తూ రెండు మూడు సార్లు చేస్తే సరి. వాపుతోపాటు నొప్పీ తగ్గుతుంది.

మొటిమలు తరచూ వస్తోంటే బెంజాల్‌ పెరాక్సైడ్‌ 2% ఉన్న క్రీమును తెచ్చిపెట్టుకోవడం మంచిది. దీన్ని ముఖంపై సమస్య ఉన్నచోట శుభ్రంగా కడిగాక రాస్తే సరి. బ్యాక్టీరియాను చంపడమే కాదు. వాపునీ తగ్గిస్తుంది. నొప్పీ అదుపులోకి వస్తుంది.

మొటిమ ఎర్రగా మారి, కాస్త చీము కనిపిస్తోంటే వేడి కాపడం పెట్టడం మంచిది. వేడినీటిలో ముంచిన వస్త్రాన్ని నీరు లేకుండా బాగా పిండి, నొప్పి ఉన్నచోట 5 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాల విరామంతో 2, 3 సార్లు చేయాలి. అయితే మరీ వేడిగా ఉండకుండా చూసుకోవడం మంచిది.

మొటిమ కనిపించగానే చాలామంది పేస్ట్‌ రాస్తారు. దీంట్లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, బేకింగ్‌ సోడా, ఆల్కహాల్‌ వంటివి ఉంటాయి. దీంతోనూ ఇన్‌ఫ్లమేషన్‌ రావచ్చు. కాబట్టి, పేస్ట్‌ పెట్టకపోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్