మెడనొప్పికి లావెండర్‌ ఆయిల్‌

గంటల తరబడి కంప్యూటర్‌ ముందు పని చేయడం, సౌకర్యంగా లేని కుర్చీలో ఎక్కువసేపు కూర్చోవడం... వంటింట్లో పనిచేస్తూ ఫోన్‌ను మెడ, భుజాల మధ్య ఉంచుకుని అధిక సమయం మాట్లాడటం వంటివన్నీ మెడనొప్పికి కారణం. ఇది సుదీర్ఘంగా ఉంటే అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

Updated : 10 Jun 2021 06:01 IST

గంటల తరబడి కంప్యూటర్‌ ముందు పని చేయడం, సౌకర్యంగా లేని కుర్చీలో ఎక్కువసేపు కూర్చోవడం... వంటింట్లో పనిచేస్తూ ఫోన్‌ను మెడ, భుజాల మధ్య ఉంచుకుని అధిక సమయం మాట్లాడటం వంటివన్నీ మెడనొప్పికి కారణం. ఇది సుదీర్ఘంగా ఉంటే అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. కొన్ని చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చంటున్నారు.
* బ్రేక్‌ తీసుకోండి...  ఎక్కువ  గంటలు కదలకుండా కూర్చో కూడదు. ప్రతి గంటకూ చిన్న బ్రేక్‌ తీసుకోవాలి. కూర్చునే విధానాన్ని కూడా మధ్య మధ్యలో మార్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ మెడపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
* లావెండర్‌ ఆయిల్‌తో... మెడనొప్పిగా అనిపిస్తే కాసేపు పనిని పక్కన పెట్టాలి. ల్యావెండర్‌ ఆయిల్‌తో నొప్పి ఉన్న చోట పదినిమిషాలు మృదువుగా మర్దన చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు చేస్తే మంచిది. అలాగే... చిన్న అల్లం ముక్కను నూరి కప్పు నీటిలో మరిగించి చల్లార్చాలి. ఇందులో కొన్ని చుక్కలు తేనె వేసి తాగితే ఉపశమనంగా ఉంటుంది.  
* యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో... రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కలపాలి. ఇందులో మెత్తని కాటన్‌ టవల్‌ను ముంచి మెడపై మృదువుగా ఒత్తుకోవాలి. పావుగంట చొప్పున రెండుపూటలా చేస్తే ఊరట లభిస్తుంది.
* బరువెత్తకుండా...మెడనొప్పి ఉన్నప్పుడు బరువు లెత్తకుండా జాగ్రత్తపడాలి. మెడకు సంబంధించి తేలికైన వ్యాయామాలు చేయడం, విశ్రాంతి ద్వారా ఉపశమనం పొందొచ్చు. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్