మెట్లెక్కండి...పొట్ట తగ్గించుకోండి!

వ్యాయామానికి జిమ్‌కే వెళ్లనక్కర్లేదు. కాస్త మనసుపెడితే మార్గాలెన్నో దగ్గర్లోనే కనిపిస్తాయి. అలాంటి వాటిలో మెట్లెక్కడం కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలేంటో చూద్దామా!

Published : 23 Jun 2021 00:54 IST

వ్యాయామానికి జిమ్‌కే వెళ్లనక్కర్లేదు. కాస్త మనసుపెడితే మార్గాలెన్నో దగ్గర్లోనే కనిపిస్తాయి. అలాంటి వాటిలో మెట్లెక్కడం కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలేంటో చూద్దామా!
కొవ్వు వేగంగా కరిగే వ్యాయామాల్లో మెట్లెక్కడం కూడా ఒకటి. ఒకేసారి శరీరంలోని అనేక కండరాలు పనిచేయడం వల్ల దృఢంగానూ మారతాయి. రోజూ పావుగంట పాటు ఇలా చేస్తే సుమారు అరవై ఐదు కెలొరీలు తగ్గుతాయంటారు వైద్యులు.
* మెట్లెక్కితే... శరీరంలోని కింది భాగానికి మంచి వ్యాయామం. పిరుదులు, తొడలు టోనింగ్‌ అవుతాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. రక్తప్రసరణ సరిగా జరగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగానూ ఉంటాయి.
*  మెట్లెక్కి దిగడం వల్ల పాదాల్లో ఉండే కండరాలు బ్యాలెన్స్‌ అవుతాయి. శరీర సామర్థ్యం, ఏకాగ్రతా పెరుగుతాయి. ఫలితంగా ఒత్తిడి అదుపులో ఉంటుంది. అర్థరైటిస్‌ సమస్యలున్నవారు మాత్రం డాక్టర్ల సలహామేర
చేస్తే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్