బిడ్డ బరువుని పెంచే మెంతులు

చక్కటి సువాసనతో పాటు వంటకాలకు రుచి తెచ్చే మెంతులు వంటింటి దినుసుల్లో తప్పనిసరి. ఇంతేనా వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ బోలెడు. అవేంటో  చూడండి?

Published : 05 Aug 2021 01:05 IST

చక్కటి సువాసనతో పాటు వంటకాలకు రుచి తెచ్చే మెంతులు వంటింటి దినుసుల్లో తప్పనిసరి. ఇంతేనా వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ బోలెడు. అవేంటో  చూడండి?
మెంతులను క్రమం తప్పక తినడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. వీటిలో ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌, రాగి, విటమిన్‌ బి6, ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పీచు శరీరంలో చక్కెరను పీల్చుకునే రేటును తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ పెంచడానికి కూడా సహాయపడుతుంది.  
* మెంతుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఉపశమనాన్నిస్తాయి. అల్సర్‌, అజీర్తి సమస్యలున్న వారికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. మూత్ర పిండాలు, కాలేయ ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
* పీరియడ్స్‌లో వచ్చే తలనొప్పి, వికారం, ఇతర సమస్యలను మెంతులు తగ్గిస్తాయి. మెంతులను పొడిగా చేసి కొద్దిగా నీటిలో కలిపి తీసుకొంటే సరిపోతుంది. బాలింతలు మెంతులను తీసుకొంటే.. పాలు బాగా పడతాయి. దీనిలో ఉన్న ఫైటోఈస్టోజ్రెన్‌ పాలను పెంచడంతో పాటు బిడ్డ బరువు పెరిగేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్