బరువు తగ్గాలా... ఇవి తినండి!
బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవడం ఒకటే మార్గం అనుకుంటారు చాలామంది. కానీ ఈ పదార్థాలు తింటే కూడా అది సాధ్యమే అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే...
బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవడం ఒకటే మార్గం అనుకుంటారు చాలామంది. కానీ ఈ పదార్థాలు తింటే కూడా అది సాధ్యమే అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే...
బ్లాక్ బీన్స్... వీటిలో బోలెడు పీచు ఉంటుంది. వీటిని తింటే పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఈ బీన్స్ హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను అయిదు శాతం తగ్గిస్తాయట.
మిరియాలు... వీటిలోని పెపరైన్ అనే పదార్థం కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, పొట్టా రెండింటినీ తగ్గిస్తుంది.
బెల్ పెప్పర్... విటమిన్-సి దండిగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సాయపడి పిండి పదార్థాలను శక్తిగా మారుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
పాలకూర... ఐరన్ అధికంగా ఉండే ఈ ఆకుకూరను గుడ్డుతో కలిపి ఆమ్లెట్‌లా తీసుకుని చూడండి. పోషకాలూ అందుతాయి. బరువూ నియంత్రణలో ఉంటుంది. మరింకేం వీటిని ప్రయత్నించి చూడండి.
కొబ్బరి నూనె... దీనిలోని కొవ్వులు బరువును నియంత్రిస్తాయి. ఈ నూనెను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. ఆరోగ్యమూ బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.