అక్కడ తగ్గాలంటే... ఈత కొట్టాల్సిందే

కొందరికి బాహు మూలల్లో, నడుముకు ఇరువైపుల కొవ్వు పేరుకుపోతుంది. దాంతో నచ్చిన దుస్తులను వేసుకోలేరు. చూడటానికీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫ్యాట్‌ను కరిగించాలంటే రోజువారీ చిన్నపాటి

Updated : 14 Nov 2021 04:48 IST

కొందరికి బాహు మూలల్లో, నడుముకు ఇరువైపుల కొవ్వు పేరుకుపోతుంది. దాంతో నచ్చిన దుస్తులను వేసుకోలేరు. చూడటానికీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫ్యాట్‌ను కరిగించాలంటే రోజువారీ చిన్నపాటి వ్యాయామాలు చేయాలని చెబుతారు నిపుణులు.

స్విమ్మింగ్‌ స్ట్రోక్‌ బటర్‌ ఫ్లై...

యోగా మ్యాట్‌పై బోర్లా పడుకుని కొంచెం ముందుకు వంగి రెండు చేతులను ముందుకు చాచి కింద పెట్టాలి. గాలి లోపలికి పీలుస్తూ చేతులను క్రమంగా వెనక్కి తీసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాసను విడుస్తూ మెల్లిగా చేతులను పైకి లేపాలి. ఆ తర్వాత పూర్వపు స్థితికి తీసుకురావాలి. ఇలా 15 నుంచి 20 సార్లు చేయాలి.


స్విమ్మింగ్‌ ఆన్‌ లాండ్‌...

చేతుల కింద, నడుముకు ఇరువైపుల పేరుకుపోయిన కొవ్వును కరిగించాలంటే నేల మీద ఈత కొట్టాలి మరి. కాస్త కొత్తగా ఉంది కదూ... ఎలా అంటే... నేల మీద బోర్లా పడుకుని చేతులను కాళ్లను వీలైనంత ఎడంగా చాపాలి. తలను పైకెత్తాలి. ఇప్పుడు చేతులను మెల్లిగా పైకి లేపి ముందుకు, ఆ తర్వాత వెనక్కి తిప్పాలి. ఇలా చేస్తున్నప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇదే సమయంలో ఛాతీ భాగాన్ని నేలకు ఆనించి, మోకాళ్లను కాస్త పైకి ఎత్తాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు కరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్