గింజలతో.. వెచ్చదనం

ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం కదా! ఆ జాబితాలోకి కొన్ని రకాల గింజలనూ చేర్చేయండి. వీటిల్లోని ఆరోగ్యకర ఫ్యాట్‌, ప్రొటీన్లు, ఫైబర్‌ వంటివి... ఒంట్లో ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయట. ఇంకా బోలెడు ప్రయోజనాలూ ఇస్తాయి.

Updated : 21 Nov 2021 06:46 IST

ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం కదా! ఆ జాబితాలోకి కొన్ని రకాల గింజలనూ చేర్చేయండి. వీటిల్లోని ఆరోగ్యకర ఫ్యాట్‌, ప్రొటీన్లు, ఫైబర్‌ వంటివి... ఒంట్లో ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయట. ఇంకా బోలెడు ప్రయోజనాలూ ఇస్తాయి.

నువ్వుల్లో.. జింక్‌, కాపర్‌, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లతో పాటు ఫైబర్‌ ఎక్కువ. పొడులు, బెల్లంతో... ఎలా తీసుకున్నా మంచిదే.

* పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ కాలంలో జలుబు సహా అనేక ఇబ్బందులను దూరం చేస్తాయి.

* ఊసుపోక ఏదైనా తినాలనిపిస్తే చియా విత్తనాలను ప్రయత్నించండి. ఆరోగ్యానికి మేలు చేసే న్యూట్రియెంట్లు దీనిలో ఎక్కువ. పైగా బరువునీ తగ్గిస్తాయి.

* వేరుశెనగ విత్తనాలు శరీరానికి ఫ్యూయల్‌లా పనిచేస్తాయి. దీనిలో జింక్‌, ఫైబర్‌, ప్రొటీన్‌తో పాటు మినరల్స్‌ ఎక్కువ. బరువు తగ్గడానికే కాకుండా హృద్రోగాలనూ దూరంగా ఉంచుతాయి.

* బాదంలో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

అవిసెలోనూ క్యాల్షియం, ఐరన్‌, ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్