ఈ సంకేతాలన్నీ.. జింక్‌ లోపమే!

శాంతికి నెలలు నిండుతున్నాయి. ఆహారం బాగానే తీసుకుంటున్నా తెల్లారేసరికి నిస్సత్తువ. ఎప్పుడూ నీరసమే. ఇవి జింక్‌ లోపానికి సంకేతాలు కావొచ్చు అంటున్నారు నిపుణులు. శిరోజాలు రాలడం,

Updated : 25 Mar 2022 05:44 IST

శాంతికి నెలలు నిండుతున్నాయి. ఆహారం బాగానే తీసుకుంటున్నా తెల్లారేసరికి నిస్సత్తువ. ఎప్పుడూ నీరసమే. ఇవి జింక్‌ లోపానికి సంకేతాలు కావొచ్చు అంటున్నారు నిపుణులు. శిరోజాలు రాలడం, తరచూ జలుబు వంటి పలు సమస్యలకూ ఇదే కారణమంటున్నారు.

* గర్భిణుల్లో బిడ్డ ఎదుగుదలకు జింక్‌ తప్పని సరి. ప్రసవానికి ముందు వయసు, ఎత్తుకు తగినట్లుగా బరువు ఉండాలి. అలా ఉండకపోయినా, అకస్మాత్తుగా బరువు తగ్గినా, ఉండాల్సిన దాని కన్నా బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉన్నా.. జింక్‌ లోపం కావొచ్చు. కాబట్టి, వారికి రోజూ ఆహారం ద్వారా 11 మి.గ్రా. జింక్‌ అందేలా చూడాలి. ప్రసవం తర్వాతా తల్లిపాలు సమృద్ధిగా ఉత్పత్తి కావాలన్నా రోజుకి కనీసం 12 మి.గ్రా. జింక్‌ అవసరమవుతుంది. పోషకవిలువలున్న ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావాల్సిన జింక్‌ను అది తయారుచేసుకోగలదు.

* మహిళలు తొందరగా బరువు తగ్గించుకునే ప్రక్రియలో జింక్‌ స్థాయులు పడిపోతుంటాయి. దీంతో మొత్తం ఆరోగ్యంపైనే చెడు ప్రభావం పడగలదు. కాబట్టి, వైద్యుల సూచనలు తీసుకుని ప్రయత్నించడం మంచిది.

శిరోజాలపై.. శరీరానికి విటమిన్లు, ఖనిజలవణాలు కావాల్సిన స్థాయిలో అందకపోతే జీవక్రియలు సక్రమంగా జరగవు. ఈ ప్రభావం ప్రతి అవయవంపైనా పడుతుంది. వ్యాధినిరోధక శక్తి, కణవిభజన, కొత్తకణాల ఉత్పత్తి వంటి పలురకాల క్రియల్లో జింక్‌ ప్రధానపాత్ర పోషిస్తుంది. శరీరం దీన్ని నిల్వ ఉంచుకోదు. ఎప్పటికప్పుడు తీసుకునే ఆహారం ద్వారానే అందుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే జుట్టు రాలే సమస్య అకస్మాత్తుగా పెరిగితే అది జింక్‌ లోపమే కావొచ్చు. అలాగే తరచూ జలుబు, చిన్న దెబ్బ కూడా త్వరగా తగ్గకపోవడం వంటివన్నీ దీనికి సంకేతాలే. వైద్యుడిని సంప్రదించి తగిన సప్లిమెంట్స్‌తోపాటు పోషకవిలువలుండే ఆహారానికి పెద్దపీట వేస్తే మంచిది.  

మెనోపాజ్‌లో.. ఎంతో గుర్తుగా పెట్టుకున్న వస్తువూ మరుసటిరోజు మర్చిపోవడం, పనిపై శ్రద్ధ తగ్గడం, ఏ పనిలోనూ ఆసక్తి లేకపోవడం వంటి వాటికీ చాలాసార్లు జింక్‌ లోపమే కారణం. ఇది బ్రెయిన్‌ ఫాగ్‌కు దారితీస్తుంది. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి కూడా సన్నగిల్లుతుంది. ఆహారంలో బాదం, వెల్లుల్లి, పచ్చి బఠాణీలు, గింజ ధాన్యాలు, పుట్టగొడుగులు, గుడ్లు, రొయ్యలు, చేప, మాంసం, పాలు వంటివాటికి ప్రాధాన్యమిస్తే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఉత్సాహం, చురుకుదనం తిరిగి పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్