మెనోపాజ్ వేళ... ఇవి తినండి!
సరళకు ఈ మధ్యే 45 నిండాయి. తనెప్పటిలానే తింటున్నా శరీరానికి తగినంత శక్తి అందడం లేదనిపిస్తోంది. కారణం.. మెనోపాజ్ దశలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా ఆహారపుటలవాట్లను మార్చుకోవాలంటున్నారు నిపుణులు.
సరళకు ఈ మధ్యే 45 నిండాయి. తనెప్పటిలానే తింటున్నా శరీరానికి తగినంత శక్తి అందడం లేదనిపిస్తోంది. కారణం.. మెనోపాజ్ దశలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా ఆహారపుటలవాట్లను మార్చుకోవాలంటున్నారు నిపుణులు.
వయసు పైబడుతున్నప్పుడు జీవక్రియలు నెమ్మదించడం మొదలవుతుంది. దీంతో త్వరగా అలసి పోవడం, శిరోజాలు రాలే సమస్య, తలనొప్పి, బరువు పెరగడం వంటివి ప్రారంభమవుతాయి. వీటికి దూరంగా ఉండాలంటే ఆహారంలో తగిన పోషక విలువలున్నాయో లేదో చూసుకోవాలి. జీవక్రియలు మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో పచ్చి మిర్చి కాస్తంత ఎక్కువ ఉంటే మంచిది. ఇది మెటాబాలిజంను వేగవంతం చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
అల్లం.. ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగాలి. ఇది శరీరంలో కెలోరీలను కరిగిస్తుంది. అలాగే వంటకాల్లోనూ అల్లాన్ని తప్పనిసరిగా వాడాలి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హైపర్‌టెన్సివ్, గ్లూకోజ్-సెన్సటైజింగ్ గుణాలు ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు దూరం కావడంతో బరువు అదుపులోకి వస్తుంది.
ఓట్స్... జీవక్రియలను వేగవంతం చేయడంలో ఓట్స్ బాగా పనిచేస్తాయి. కొంచెం తీసుకునే సరికి పొట్ట నిండిన భావన కలుగుతుంది. పీచు ఉండటంతో జీర్ణసమస్య ఉండదు. ఇందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణాశయాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. అలాగే డార్క్ చాక్లెట్ కూడా జీవక్రియలు మెరుగుపడటానికి దోహదపడుతుంది.
ప్రొటీన్లు.. మాంసాహారం, చేప, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నట్స్, చిక్కుడు, విత్తనాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడితే జీవక్రియలు వేగంగా జరుగుతాయి. కెలోరీలు కరుగుతాయి. ఐరన్, సెలీనియం వంటి ఖనిజలవణాలు శరీరాన్ని సమన్వయం చేస్తాయి. అలాగే 5- 6 లీటర్ల నీటిని తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. వీటన్నింటితోపాటు ఉదయం లేదా సాయంత్రం అరగంట సేపు చేసే వ్యాయామాలు మెనోపాజ్‌లో ఎదురయ్యే సమస్యలను దూరం చేసి, ఉత్సాహంగా ఉంచుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.