Cool Water: చల్లటి నీళ్లు తాగుతున్నారా?

ఈ మండు వేసవిలో బయటకి వెళ్లొస్తే చాలు ఫ్రిజ్‌లో నీళ్ల బాటిల్‌ తీసి తాగేస్తాం. హాయిగా ఉందనుకుంటాం కదా! కానీ చల్లటి నీళ్లు తాగటం వల్ల అనేక నష్టాలున్నాయి.

Updated : 03 May 2023 08:21 IST

ఈ మండు వేసవిలో బయటకి వెళ్లొస్తే చాలు ఫ్రిజ్‌లో నీళ్ల బాటిల్‌ తీసి తాగేస్తాం. హాయిగా ఉందనుకుంటాం కదా! కానీ చల్లటి నీళ్లు తాగటం వల్ల అనేక నష్టాలున్నాయి.

అజీర్తి..

చల్లటి నీరు రక్త నాళాలను సంకోచింప చేసి చేసి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

గుండె కొట్టుకునే వేగం తగ్గి..

ఎక్కువ చల్లగా ఉండే నీళ్లు తాగితే గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శరీరంలో అవయవాల పనితీరుని నియంత్రించే వేగస్‌ నరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది ప్రమాదం.

వ్యాయామం తర్వాత అసలొద్దు..

వ్యాయామం చేశాక శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. దాని తర్వాత చల్లని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలానే భోజనం తర్వాత తాగినా ఆహారం జీర్ణమవదు. దాని బదులు గోరు వెచ్చని నీళ్లు తాగడమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్