పండ్లు ఎలా తింటున్నారు?

ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు అందిస్తాయి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఇలా చాలా కారణాలతో పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటాం.

Updated : 26 Sep 2023 02:05 IST

ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు అందిస్తాయి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఇలా చాలా కారణాలతో పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటాం. ఆ ప్రయోజనాలు అందాలంటే సరైన పద్ధతిలో తినాలి కదా మరి?

  • కొందరు పండ్లను నేరుగా తినడానికి ఇష్టపడరు. అందుకని జ్యూస్‌ తయారు చేసుకుని తాగుతుంటారు. ఆరోగ్యకరమైనవిగా కనిపిస్తాయి కానీ జ్యూసుల వల్ల ఫైబర్‌తోపాటు విటమిన్లు, మినరల్స్‌, ఎంజైములు పోతాయి. రక్తంలో చక్కెర స్థాయులను కూడా పెంచుతాయి. నేరుగా తినేప్పుడు లాలాజలంలో సహజ చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి సాయపడే జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి. కాబట్టి, చక్కెర స్థాయులు పెరగవు. అందుకే రసాలుగా కాకుండా పండుగానే తీసుకుంటే మేలు.
  • సమయం లేదని మనలో చాలామంది ముక్కలుగా కోసుకొని డబ్బాల్లో సర్దుకుంటాం. ఇంట్లోవాళ్లకీ స్నాక్స్‌ రూపంలో పెడుతుంటాం కూడా. ఇదీ ఆరోగ్యానికి హాని కలిగించేదే. అప్పటికప్పుడు తింటే పర్లేదు కానీ.. ఎక్కువసేపు అలా వదిలేస్తే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. ముక్కలు రంగు మారి రుచినీ కోల్పోతాయి. అంటే.. అలా తిన్నా పెద్ద ప్రయోజనం లేదనేగా!
  • కొందరికి భోజనం చేయగానే పండ్లను తినే అలవాటు ఉంటుంది. అదీ మంచిది కాదు. జీర్ణప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ ఆమ్లాలు అవసరమవుతాయి. దీనివల్లా పోషకాలు శరీరానికి అందవు. కాబట్టి, భోజనమయ్యాక కనీసం గంట తర్వాత కానీ పండు జోలికి వెళ్లొద్దు.
  • కొందరు అసలు తినరు. మరికొందరేమో పండ్లను చూస్తే నోటిని కట్టుకోలేరు. ఎంత మంచివైనా అతి ఎప్పుడూ చేటే. గ్లూకోజ్‌, కెలోరీలు రక్తంలో నిండిపోయి అధిక బరువుకు దారితీయొచ్చు. కొన్నిసార్లు గ్యాస్‌, అజీర్తికీ కారణమవుతాయి. కాబట్టి.. మితమే ఆరోగ్యమని గుర్తుంచుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్