భుజం కదలడం లేదా?

కొంతమందిలో చేతిభుజం కదలికలు స్తంభిస్తుంటాయి. ఈ సమస్య 40 నుంచి 60 సంవత్సరాలుండే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహం, థైరాయిడ్‌, గుండె సంబంధిత వ్యాధులు ఇందుకు కారణం కావచ్చు.

Published : 09 Mar 2024 01:20 IST

కొంతమందిలో చేతిభుజం కదలికలు స్తంభిస్తుంటాయి. ఈ సమస్య 40 నుంచి 60 సంవత్సరాలుండే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహం, థైరాయిడ్‌, గుండె సంబంధిత వ్యాధులు ఇందుకు కారణం కావచ్చు. ఉద్యోగం చేసే మహిళల్లో ముఖ్యంగా కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారిలో ఈ సమస్య 40 సంవత్సరాల్లోపే కనిపిస్తుంది. తీవ్రనొప్పిని కలిగించడమే కాకుండా తిమ్మిరి, చేతివేళ్లకు స్పర్శ తెలియకపోవడం కూడా జరుగుతుంటాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.

తగ్గాలంటే... భుజాన్ని సాగదీయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇలా చేయడంవల్ల భుజం చుట్టూ ఉండే కండరాలకు మంచి వ్యాయామం జరిగి, చేయి తేలికగా కదులుతుంది. ఇది నిలబడి లేదా కూర్చుని కూడా చేయవచ్చు. ముందు ఎడమచేతిని మీ ఛాతీ మీదుగా తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడిచేయి సాయంతో ఎడమచేతిని ఫొటోలో చూపిన మాదిరిగా సాగదీయాలి (ఇందుకు కుడిచేతి ఊతం తీసుకోవచ్చు). ఈ విధంగా నిమిషం లేదా 40 సెకన్లు ఉండి నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే మరోవైపు కూడా ప్రయత్నించాలి. ఇలా రెండు పక్కలా 3నుంచి 4 సార్లు చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా నొప్పివల్ల ఏర్పడే నిద్రలేమి తగ్గుతుంది. హార్మోన్ల సమతుల్యతతో పాటు, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. భుజం, మెడ నరాలు, కండరాలకు ఉపశమనం లభిస్తుంది. భుజానికీ, మెడకీ సర్జరీలు అయినవారు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. వీటితో పాటు నొప్పిని తగ్గించడంలో సాయపడే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుండే పైనాపిల్‌, ద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి. కాకర, ఉసిరి వంటి వాటిని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇంకా... తీపి, ఉప్పులను తగ్గిస్తే మేలు.

శిరీష, యోగ గురు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్