ఒక్క పాట విందామా?

కొంతమంది ఆడవారికి ఇంటా బయటా పనుల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి సంగీతాన్ని ఆశ్రయించండి. ఇదీ ఆ ఇబ్బందులను దరిచేరనీయదు అంటున్నారు నిపుణులు. అదెలానో చూసేద్దాం.

Published : 10 Mar 2024 01:33 IST

కొంతమంది ఆడవారికి ఇంటా బయటా పనుల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి సంగీతాన్ని ఆశ్రయించండి. ఇదీ ఆ ఇబ్బందులను దరిచేరనీయదు అంటున్నారు నిపుణులు. అదెలానో చూసేద్దాం.

  • ఉదయాన్నే నిద్రలేవగానే మీరు మెచ్చే చక్కని పాట లేదా హాయిని గొలిపే మంద్రమైన సంగీతం పెట్టండి. అది చెవులకి ఇంపుగా మనసు ప్రశాంతంగా మారేలా చేస్తుంది. ఇలా శ్రావ్యమైన సంగీతంతో రోజును ప్రారంభించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు, ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
  • శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్లు అధికంగా విడుదలైనప్పుడు అది మనలో ఒత్తిడి స్థాయులను పెంచుతుంది. కొన్ని అధ్యయనాలు మనసుకు నచ్చిన సంగీతం... కార్టిసాల్‌ ఉత్పత్తిని అడ్డుకోవడంలో సాయపడుతుంది అంటున్నాయి. తద్వారా ఒత్తిడి దూరం అవుతుంది. హిప్‌హాప్‌, జానపదం, హుషారెత్తించే రాక్‌ ... అదీ ఇదీ అని లేకుండా ఆ క్షణం మనసులో మెదిలిన దాన్ని పెట్టేసుకొని ఆనందించేయండి.
  • సంగీత పరికరాల నుంచి వినిపించే రిథమ్స్‌ సానుకూల దృక్పథాన్ని పెంచడంలోనూ సాయపడతాయి. ఉత్తేజపరిచే ట్యూన్‌లు కొత్త ఆలోచనల్ని పెంచేస్తాయి. కాబట్టి, ఆనందమే కాదు, కెరియర్‌లో ముందుకు సాగాలన్నా, లోలోపల దాగున్న సృజనాత్మకత వెలికి తీయాలన్నా ఓ పాట వినేయాలన్న మాట. ఇంకేం... మూడ్‌ బాగోకపోయినా, బద్ధకంగా తోచినా, కొత్త ఆలోచనలు రావడం లేదన్నా అలా సంగీతానికి తల ఊపేయండి. ఆసక్తి ఉంటే అలా అలా కాలును కదిపితే మనసుతోపాటు శరీరానికీ ఆరోగ్యం. ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్