జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లనివ్వొద్దు...

బడి నుంచి ఇంటికొస్తే చాలు... జంక్‌ఫుడ్‌ కావాలని మారాం చేస్తారు పిల్లలు. చిప్సో, బర్గర్లో... ఏదో ఒకటి నోట్లో పడందే ఊరుకోరు. కానీ, ఇలా వీటికి అలవాటు పడితే... అధిక బరువు సమస్యతో పాటు అనేక అనారోగ్యాలూ ఇబ్బంది పెడతాయంటారు పోషకాహార నిపుణులు.

Published : 10 Mar 2024 01:36 IST

బడి నుంచి ఇంటికొస్తే చాలు... జంక్‌ఫుడ్‌ కావాలని మారాం చేస్తారు పిల్లలు. చిప్సో, బర్గర్లో... ఏదో ఒకటి నోట్లో పడందే ఊరుకోరు. కానీ, ఇలా వీటికి అలవాటు పడితే... అధిక బరువు సమస్యతో పాటు అనేక అనారోగ్యాలూ ఇబ్బంది పెడతాయంటారు పోషకాహార నిపుణులు. కాబట్టి...

ప్రత్యామ్నాయం చూపించండి...

జంక్‌ఫుడ్‌ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ పూర్తిగా తగ్గుతుంది. అలాగే కార్బొహైడ్రేట్లు పెరిగి, అధికబరువుకు దారితీస్తుంది. వీటి నుంచి విడుదలయ్యే గ్లూకోజు రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. దీంతో చిన్న వయసులోనే పిల్లలు మధుమేహానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగని పిల్లల్లో ఒక్కసారిగా ఈ అలవాటుని మాన్పించలేం. క్రమంగా ఆంక్షలు పెట్టి ఈ తరహా ఆహారం తినే అవకాశాన్ని తగ్గించండి. ఆపై చిరుధాన్యాలతో చేసిన ఛాట్‌లు, జంతికలు వంటి ప్రత్యామ్నాయాలను పరిచయం చేయండి. ఇవి వీరి మనసుని మళ్లిస్తాయి.

ప్రాధాన్యత చెప్పండి...

ఈ తరహా ఆహారం తయారీలో వినియోగించే రసాయనాలు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జంక్‌ఫుడ్‌ తీసుకున్న తరవాత నోట్లో పలురకాల యాసిడ్స్‌ తయారై, దంతాల పరిరక్షణలో ప్రధానంగా ఉండే ఎనామిల్‌పై తీవ్రప్రభావం చూపుతాయి. అంతేకాదు, ఎముకల సాంద్రత తగ్గే ప్రమాదం ఉంది. ఇవన్నీ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. ఇంట్లోనే అటుకుల మిక్చర్స్‌, చెరకు ముక్కలు, ఫ్రూట్‌ జెల్లీలు, పండ్ల రసాలు వంటివి తయారు చేసి, అందించండి. ప్రయోజనాలు చెబుతూ తినమంటే వాళ్లకీ ఆసక్తి కలుగుతుంది. అయితే వాళ్లు మెచ్చేలా రుచికరంగా అందించాలి మరి.

భాగస్వాముల్ని చేయండి...

పిల్లలకు ఖాళీ సమయాల్లో ఏదైనా తినాలని అనిపించినప్పుడు వారికి ఇంట్లోనే ఏదో ఒకటి ఆరోగ్యకరంగా తయారుచేసివ్వడం మంచిది. చేసే వంటలో వారినీ భాగస్వాములను చేయాలి. ఆమ్లెట్‌, బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి వారితో దగ్గరుండి చేయించాలి. రుచి ఎలాగున్నా వారి చేత్తో చేయడంతో ఆసక్తిగా తింటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్