ఆరోగ్యానికి మంత్రాలివీ..

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయన్నది తెలిసిందే. మరి దాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలి. క్యాబేజీ, బ్రోకలీ, ఆకుకూరలు మొదలైనవి తరచూ తినడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

Published : 11 Mar 2024 02:19 IST

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయన్నది తెలిసిందే. మరి దాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

పోషకాహారం... విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలి. క్యాబేజీ, బ్రోకలీ, ఆకుకూరలు మొదలైనవి తరచూ తినడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

నిద్ర... అలసిన శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి రోజుకి కనీసం 8 గంటల నిద్ర అవసరం. సమయంతో పాటు నిద్ర వేళలూ ముఖ్యమే అని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ఎక్కువగా రాత్రిపూట నిద్రకే ప్రాధాన్యమివ్వాలి. అంతేకాదు, నిద్రలేమి వల్ల ఒత్తిడికి గురవ్వడమే కాదు... మానసిక అనారోగ్యాలకూ దారితీస్తుంది. కాబట్టి, దీన్ని అశ్రద్ధ చేయకూడదు.

వ్యాయామం... క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. తెల్లరక్త కణాల పెరుగుదలకి ఇది ఎంతగానో దోహదపడటమే ఇందుకు కారణం. రోజూ ఉదయం పావుగంట ఎండలో నడక, జాగింగ్‌  చేయడం వల్ల శరీరానికి కావాల్సిన డి-విటమిన్‌ లభిస్తుంది. ఇది శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షించి, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులనూ తొలగిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్