సూర్య నమస్కారాలతో ఆరోగ్యంగా...

వ్యాయామాల కోసం పొద్దున్నే హడావుడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేస్తుంటాం. అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు.

Published : 15 Mar 2024 01:39 IST

వ్యాయామాల కోసం పొద్దున్నే హడావుడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేస్తుంటాం. అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు.

  • రోజూ అరగంట సూర్య నమస్కారాలు చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుంది. అలానే శరీరంలో అదనంగా పేరుకున్న కెలొరీలు ఖర్చువుతాయి. అంతేకాదు, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి.
  • నెలసరి సమస్యలను సూర్య నమస్కారాలతో దూరం చేయొచ్చు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే పీసీఓడీ వంటి సమస్యనూ నియంత్రించవచ్చు.
  • క్రమం తప్పకుండా రోజూ వీటిని చేయడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. అలానే రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మానికీ, ముఖానికీ ప్రకాశవంతమైన కాంతిని అందిస్తుంది. వృద్ధాప్యఛాయలు దూరం అవుతాయి.
  • ఇంటాబయటా పనుల కారణంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలా రోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఒత్తిడీ ఆందోళననూ తగ్గించుకోవచ్చు. జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దానివల్ల మనసుకూ ప్రశాంతత లభిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నా తొలగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్