ఆందోళన తగ్గించే కాళీ ముద్ర

మారుతోన్న జీవనశైలి కారణంగా కొంతమందిలో ఆందోళన, కుంగుబాటు పెరిగి ప్రతికూల ఆలోచనలకు దారితీస్తున్నాయి. వీటి నుంచి బయట పడాలంటే ఈ కాళీ ముద్ర ప్రయత్నించి చూడండి.

Published : 16 Mar 2024 01:55 IST

మారుతోన్న జీవనశైలి కారణంగా కొంతమందిలో ఆందోళన, కుంగుబాటు పెరిగి ప్రతికూల ఆలోచనలకు దారితీస్తున్నాయి. వీటి నుంచి బయట పడాలంటే ఈ కాళీ ముద్ర ప్రయత్నించి చూడండి. శరీరంలోని శక్తిని పెంచుతుంది. మెనోపాజ్‌ సమయంలో శరీరంలో వచ్చే సమస్యలకు ఇది మందులా పనిచేస్తుంది. దీన్ని నేలమీద లేదా కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. ముందుగా దీనికోసం పద్మాసనం వేసుకుని ఫొటోలో చూపిన విధంగా రెండు చేతుల్నీ మడిచి కేవలం చూపుడు వేళ్లను మాత్రమే పైకి పెట్టాలి. ఈ సమయంలో రెండు మోచేతులు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. చేతులను శరీరానికి రెండు అంగుళాలు దూరంగా ఉండేలా చూడాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈ ముద్ర వేయడానికి తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య అనువైన సమయం. రోజూ పది నుంచి పదిహేను నిమిషాలు చేయాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆందోళన తగ్గి మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్