ఆ చొరవ మీ నుంచే...

పెళ్లి కుదిరిన ప్రతి అమ్మాయి తన అత్తింటి గురించి ఒక ఊహాలోకం రూపొందించుకుంటుంది. కానీ అవి కొన్ని సార్లు...

Updated : 08 Dec 2022 20:18 IST

పెళ్లి కుదిరిన ప్రతి అమ్మాయి తన అత్తింటి గురించి ఒక ఊహాలోకం రూపొందించుకుంటుంది. కానీ అవి కొన్ని సార్లు అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు. అసలు పెళ్లికి ముందు మన ఆలోచనలు ఎలా ఉండాలంటే..

* మనం అడుగుపెట్టబోయే ఇంటి గురించి ఊహించుకోవడంలో తప్పులేదు. అయితే అవన్నీ మీకు ఇప్పుడున్న పద్ధతుల గురించి, అలవాట్ల గురించి వాటిలో చేసుకోవల్సిన మార్పుల గురించి ఉండాలి. అంతేగానీ..అక్కడి వ్యక్తులు ఇలా ఉండాలి, వారు నాతో ఇలా మాట్లాడాలి.. అనే ధోరణి వద్దు.  అతిగా ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు.
కొత్తలో కుటుంబసభ్యులతో మాట్లాడటానికి తప్పకుండా కాస్త ఇబ్బంది పడతాం. వాళ్లకి కూడా అంతే. అది మొహమాటం వరకూ పర్లేదు కానీ..వారు పలకరిస్తేనే నేను మాట్లాడాలి అని మౌనంగా ఉండకూడదు. వీలైతే ముందు మీరే చొరవగా మాటాడటానికి ప్రయత్నించాలి.
మీ పుట్టింట్లో మీకున్న ప్రాధాన్యమే అక్కడా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. లేకపోతే మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మీకన్నా ముందు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇక్కడ మీరనుకున్న స్థానంలో ఉండొచ్చు. మీఇంట్లో మీరెలాగో ఇక్కడ కూడా వారలాగే అని గుర్తించాలి.
అన్ని విషయాలను మీ పుట్టింట్లోలా పోల్చుకుంటే ఆనందంగా ఉండటం అసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలగాలి. అలవాట్లూ, పద్ధతులు..ఏవైనా సరే పరిస్థితులను బట్టి వచ్చేవే. ‘నేను సర్దుకుపోవాలి...’ అనే ధోరణిని మీనుంచే మొదలుకావాలి. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్