బంధం సజావుగా సాగాలా?

వివాహ బంధం సజావుగా సాగాలనే కదా ఎవరైనా కోరుకునేది? అలా కొనసాగాలంటే కొన్నింటిని అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు.

Updated : 07 Dec 2022 04:39 IST

వివాహ బంధం సజావుగా సాగాలనే కదా ఎవరైనా కోరుకునేది? అలా కొనసాగాలంటే కొన్నింటిని అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* క్షమించడం, క్షమాపణ కోరడం.. ఈ రెండింటి విషయంలో ఎప్పుడూ వెనకాడొద్దట. చాలా సందర్భాల్లో చిన్ని చిన్ని గొడవలూ విడిపోవడం వరకూ రాకుండా ఇవి చేయగలవట. మనస్పర్థలు ఏ జంటకైనా మామూలే. ఆ కోపంలో మాట జారుతుంటాం కూడా! ‘అయ్యో అనవసరంగా అన్నానే’ అనిపించిందా.. మీలో మీరు బాధపడటం కాదు. భాగస్వామిని క్షమాపణ అడిగేయండి. అవతలివాళ్లు తప్పు చేశారు. అప్పటికి కోపమొచ్చినా.. చిన్నదే అనిపించిందా క్షమించేయండి. వాళ్లే తప్పు తెలుసుకొని క్షమించమన్నారా.. ఇదింకా మంచి సూచనేగా! తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం, క్షమించడం.. ఈ సూత్రాన్ని ఇద్దరూ పాటించాలన్న నియమాన్ని పెట్టుకోండి.

* ప్రేమ తగ్గిపోయింది.. ఈ మాటకు అవకాశమివ్వకండి. రోజులో ఇద్దరూ కొంత సమయం గడపడం, కబుర్లు చెప్పుకోవడం, ఆత్మీయస్పర్శ.. పెళ్లైన కొత్తలో అందరూ పాటించేవే! బాధ్యతలనీ.. వయసు పెరుగుతోందనీ వీటికి దూరమవుతుంటారు. ఫలితమే ఇద్దరి మధ్యా దూరం. ఆఫీసు నుంచి వచ్చాక చిన్న కౌగిలింత, ఆరోజు ఎలా గడిచిందో పంచుకోవడం, అడగడం, కలిసి భోజనం.. ఇవన్నీ ఆత్మీయతను పెంచేవే.

* ఉదయాన్నే ‘గుడ్‌ మార్నింగ్‌’.. ఆఫీసుకు వెళుతోంటే సాగనంపడం, మధ్యాహ్నం భోజనం చేశారో లేదో కనుక్కోవడం, రాత్రి తప్పకుండా ‘గుడ్‌ నైట్‌’ చెప్పడం.. రోజూ ఇలాంటి అలవాట్లను చేసుకోండి. ఇలాంటివి బంధాన్ని బలోపేతం చేయడమే కాదు.. ఒత్తిడినీ దూరం చేయగలవట.

* ఏదైనా చర్చించాలా? ఉదయం 9 నుంచి రాత్రి 9లోపే అని రూల్‌ పెట్టుకోండి. మిగతా సమయాల్లో భావోద్వేగాలు అదుపులో ఉండవట. ఊరికే కోపగించుకోవడమో, చిన్నవాటికే బాధపడే వాటికి ఆస్కారమెక్కువ. కాబట్టి.. అసంతృప్తులు, గొడవలేమైనా.. ఈ గంటల మధ్యే చర్చించుకోండి.

* గొడవలకు ఎక్కువ అవకాశం ఉండేది ఆర్థిక విషయాల్లోనే! ఏం కొనాలి, ఎలా దాయాలి.. వంటివన్నీ కలిసి చర్చించుకోండి. నెలవారీ బడ్జెట్‌ను పక్కాగా ప్రణాళిక వేసుకోండి. ఏం కొనాలన్నా ఉమ్మడి అభిప్రాయం తీసుకుంటోంటే.. ఇక గొడవలకు తావేది? ఇవన్నీ చిన్న నియమాలే! పక్కాగా కొనసాగించండి. మీ బంధం.. నల్లేరు మీద నడకే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్